సాధారణంగా దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ధరలను సవరిస్తాయి. మూడు నెలలకు పైగా ధరల్లో మార్పులేదు.
అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు భారీగా పెరుగుతున్నప్పటికీ, వంద రోజులు దాటిన తర్వాత కూడా మన వద్ద ధరలు స్థిరంగా ఉన్నాయి. గవర్నమెంట్ ఆయిల్ కంపెనీ ఇండియా ఆయిల్(IOCL) చమురు ధరలకు సంబంధించి నేడు (ఫిబ్రవరి 18, 2022) కొత్త ధరలను విడుదల చేశాయి. అయితే ధరల్లో ఎలాంటి మార్పులేదు.
సాధారణంగా దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ధరలను సవరిస్తాయి. మూడు నెలలకు పైగా ధరల్లో మార్పులేదు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఇటీవల పైకి, కిందకు కదులుతున్నాయి. ఈ ప్రభావం దేశీయంగా పెట్రోల్, డీజిల్ పైన ఉండనుంది. ఓ వైపు అంతర్జాతీయంగా ధరలు భారీగా పెరుగుతున్నాయి. అయితే ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత ధరలు పెరిగే అవకాశముంది.
వివిధ నగరాల్లో నేటి పెట్రోల్, డీజిల్ ధరలు
- ఢిల్లీలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 95.41, డీజిల్ లీటర్ కు రూ. 86.67
- చెన్నైలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 101.40, డీజిల్ ధర లీటర్ కు రూ. 91.43
- కోల్‌కతాలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 104.67, డీజిల్ ధర లీటర్ కు రూ. 89.79
- త్రివేండ్రంలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 106.36, డీజిల్ ధర లీటర్ కు రూ. 93.47
- హైదరాబాద్‌లో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 108.20, డీజిల్ ధర లీటర్ కు రూ. 94.62
- విశాఖపట్నంలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 109.05, డీజిల్ ధర లీటర్ కు రూ. 95.18
- బెంగళూరులో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 100.58, డీజిల్ ధర లీటర్ కు రూ. 85.01
- జైపూర్‌లో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 107.06, డీజిల్ ధర లీటర్ కు రూ. 90.70
- లక్నోలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 95.28, డీజిల్ ధర లీటర్ కు రూ. 86.80
- భువనేశ్వర్‌లో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 102.10, డీజిల్ ధర లీటర్ కు రూ. 91.62
- ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.98కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.94.14గా ఉంది.
అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు హెచ్చు తగ్గులు నమోదు చేస్తున్నాయి. WTI క్రూడ్ 91.16 డాలర్లు, బ్రెంట్ క్రూడ్ 92.40 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. డిమాండ్ క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో మార్చి నుండి సౌదీ అరేబియా ఉత్పత్తిని పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతల కారణంగా చమురు ధరలు ఇటీవల పైపైకి చేరుకున్నాయి. అయితే క్రితం సెషన్‌లో ధరలు తగ్గాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కొన్ని నెంబర్లు ఇచ్చాయి. వీటికి ఎస్ఎంఎస్ చేయాలి. ఇండియన్ ఆయిల్ రేట్లు తెలుసుకోవాలంటే మీరు మీ ఫోన్ నుంచి 9224992249 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి.
