Asianet News TeluguAsianet News Telugu

Petrol Diesel Prices Today: గుడ్ న్యూస్.. స్థిరంగా పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు..!

ప్రభుత్వరంగ చమురు కంపెనీ ఇండియన్ ఆయిల్(IOCL) చమురు ధరలకు సంబంధించి నేడు (జనవరి 26, 2022) ధరలను విడుదల చేశాయి. దాదాపు మూడు నెలలుగా పెట్రోల్, డీజిల్ ధరల్లో దాదాపు మార్పులేదు. దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ధరలను సవరిస్తాయి.
 

Petrol Diesel Prices Today
Author
Hyderabad, First Published Jan 26, 2022, 9:12 AM IST

ప్రభుత్వరంగ చమురు కంపెనీ ఇండియన్ ఆయిల్(IOCL) చమురు ధరలకు సంబంధించి నేడు (జనవరి 26, 2022) ధరలను విడుదల చేశాయి. దాదాపు మూడు నెలలుగా పెట్రోల్, డీజిల్ ధరల్లో దాదాపు మార్పులేదు. దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ధరలను సవరిస్తాయి.

గత ఏడాది కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన అనంతరం ధరలు తగ్గాయి. దీపావళికి ముందు మోడీ ప్రభుత్వం పెట్రోల్ పైన రూ.5, డీజిల్ పైన రూ.10 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించి ఆ పండుగ సందర్భంగా శుభవార్త చెప్పింది. పలు రాష్ట్రాలు కూడా కేంద్రం బాటలో నడిచి ధరలు తగ్గించాయి. తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు యథాతథంగా కొనసాగిస్తున్నాయి. ఢిల్లీలోను అక్కడి ప్రభుత్వం వ్యాట్‌‍ను తగ్గించింది. వ్యాట్‌ను ముప్పై శాతం నుండి 19.40 శాతానికి తగ్గించింది. దీంతో ఇక్కడ పెట్రోల్ ధర రూ.8 తగ్గింది. ఇటీవలే జార్ఖండ్ ప్రభుత్వం టూవీలర్స్‌కు లీటర్ పెట్రోల్ పైన రూ.25 తగ్గింపును అమలు చేసింది. వివిధ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి.

- ఢిల్లీలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 95.41, డీజిల్ లీటర్ కు రూ. 86.67

- చెన్నైలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 101.40, డీజిల్ ధర లీటర్ కు రూ. 91.43

- కోల్‌కతాలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 104.67, డీజిల్ ధర లీటర్ కు రూ. 89.79

- త్రివేండ్రంలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 106.36, డీజిల్ ధర లీటర్ కు రూ. 93.47

- హైదరాబాద్‌లో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 108.20, డీజిల్ ధర లీటర్ కు రూ. 94.62

- విశాఖ‌ప‌ట్నంలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 109.05, డీజిల్ ధర లీటర్ కు రూ. 95.18

- బెంగళూరులో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 100.58, డీజిల్ ధర లీటర్ కు రూ. 85.01

- జైపూర్‌లో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 107.06, డీజిల్ ధర  లీటర్ కు రూ. 90.70

- లక్నోలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 95.28, డీజిల్ ధర లీటర్ కు రూ. 86.80

- భువనేశ్వర్‌లో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 101.81, డీజిల్ ధర లీటర్ కు రూ. 91.62

 - ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.98కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.94.14గా ఉంది.

బ్రెంట్ క్రూడ్ ఆయిల్ 2022 క్యాలెండర్ ఏడాది మూడో త్రైమాసికంలో బ్యారెల్‌కు 100 డాలర్లకు చేరుకునే అవకాశాలు ఉన్నాయని గోల్డ్ మన్ శాక్స్ అంచనా వేస్తోంది. ఒమిక్రాన్ కారణంగా డిమాండ్ తగ్గుతుందని భావించినప్పటికీ, ఇది పెరుగుతుందని పేర్కొంది. సరఫరా డిమాండ్, ఒపెక్ ప్లస్ దేశాల ఉత్పత్తి క్షీణత ప్రభావంతో ధరలు భారీగా పెరుగుతాయని అంచనా వేస్తోంది. అదే జరిగితే మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి మండిపోయే అవకాశముంది.

Follow Us:
Download App:
  • android
  • ios