Asianet News TeluguAsianet News Telugu

పెట్రోల్ డీజిల్ ధరల అప్‌డేట్: కొత్త సంవత్సరానికి ఇంధన ధరలు తగ్గనున్నాయా.. నేటి ధరలు ఇవే..

భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలలో ఎటువంటి మార్పు లేకుండా నేటికీ వరుసగా 215వ రోజు. నేడు  అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధర తగ్గుముఖం పట్టింది. WTI క్రూడ్ ధర బ్యారెల్‌కు $78కి, బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు $85కి పడిపోయింది.

Petrol Diesel Prices Today on December 21: Check latest fuel rates in your cities
Author
First Published Dec 21, 2022, 9:23 AM IST

అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధర తగ్గుతున్న నేపథ్యంలో భారతీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు నేడు పెట్రోల్, డీజిల్ తాజా ధరలను విడుదల చేశాయి. అయితే, భారత చమురు కంపెనీలు బుధవారం అంటే డిసెంబర్ 21న పెట్రోల్, డీజిల్ ధరలను ఎప్పటిలాగే స్థిరంగా ఉంచాయి.

భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలలో ఎటువంటి మార్పు లేకుండా నేటికీ వరుసగా 215వ రోజు. ఈ రోజు అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధర తగ్గుముఖం పట్టింది. WTI క్రూడ్ ధర బ్యారెల్‌కు $78కి, బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు $85కి పడిపోయింది.

అంతకుముందు మే 21న కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. లీటర్ పెట్రోల్‌పై రూ.8, డీజిల్‌పై రూ.6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించారు. అప్పటి నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు దిగోచ్చాయి.  కేంద్రం ప్రకటన తర్వాత రాజస్థాన్, మహారాష్ట్ర, ఒడిశా, కేరళ ప్రభుత్వాలు కూడా పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ని తగ్గించాయి.

ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.31, డీజిల్ ధర రూ.94.27. కోల్‌కతాలో పెట్రోలు ధర రూ.106.03, డీజిల్ ధర లీటరుకు రూ.92.76గా ఉంది. మరోవైపు చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.63, డీజిల్ ధర రూ.94.24గా ఉంది.

 రాజస్థాన్‌లోని గంగానగర్‌, హనుమాన్‌గఢ్‌ జిల్లాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు అత్యధికంగా ఉన్నాయి. గంగానగర్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.113.48, డీజిల్‌ ధర రూ.98.24. హనుమాన్‌గఢ్‌ జిల్లాలో లీటర్‌ పెట్రోల్‌ ధర  రూ.112.54కు, డీజిల్‌ ధర  రూ.97.39గా ఉంది.

 పెట్రోల్, డీజిల్ ధర పోర్ట్ బ్లెయిర్‌లో అత్యంత తక్కువ ధరలు లభిస్తుంది, ఇక్కడ పెట్రోల్ ధర లీటరుకు రూ. 84.10, డీజిల్ ధర లీటరుకు రూ.79.74గా ఉంది.

నేటి పెట్రోల్ డీజిల్ ధరలు 

హైదరాబాద్: లీటర్ పెట్రోల్ ధర రూ.109.66, డీజిల్ ధర రూ.97.82.

బెంగళూరు: లీటర్ పెట్రోల్ ధర రూ.101.94, డీజిల్ ధర రూ.87.89.

తిరువనంతపురం: లీటర్ పెట్రోల్ ధర రూ.107.71, డీజిల్ ధర రూ.96.52.

పోర్ట్ బ్లెయిర్: లీటర్ పెట్రోల్ ధర రూ. 84.10, డీజిల్ ధర రూ.79.74.

భువనేశ్వర్: లీటర్ పెట్రోల్ ధర రూ.103.19, డీజిల్ ధర రూ.94.76.

చండీగఢ్: లీటర్ పెట్రోల్ ధర రూ.96.20, డీజిల్ ధర రూ.84.26.

లక్నో: లీటర్ పెట్రోల్ ధర రూ.96.57, డీజిల్ ధర రూ.89.76.

నోయిడా: లీటర్ పెట్రోల్ ధర రూ.96.57, డీజిల్ ధర రూ.89.96.

జైపూర్: లీటర్ పెట్రోల్ ధర రూ.108.48, డీజిల్ ధర రూ.93.72.

పాట్నా: లీటర్ పెట్రోల్ ధర రూ.107.24, డీజిల్ ధర రూ.94.04

 ఎక్సైజ్‌ డ్యూటీ, డీలర్‌ కమీషన్‌ ఇతర చార్జీలు కలిపితే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు అసలు ధర కంటే దాదాపు రెట్టింపు అవుతాయి. విదేశీ మారకపు ధరలతో పాటు అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరల ఆధారంగా పెట్రోల్, డీజిల్ ధరలను ప్రతిరోజూ సమీక్షిస్తుంటారు.

ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు పెట్రోలు, డీజిల్ ధరల్లో మార్పు ఉంటుంది. కొత్త ధరలు ఉదయం 6 గంటల నుంచి వర్తిస్తాయి. పెట్రోల్, డీజిల్ ధరలకు ఎక్సైజ్ సుంకం, డీలర్ కమీషన్, వ్యాట్  ఇతర జోడించిన తర్వాత, దాని ధర అసలు ధర కంటే దాదాపు రెట్టింపు అవుతుంది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఇంత ఎక్కువగా కనిపించడానికి ఇదే కారణం.

Follow Us:
Download App:
  • android
  • ios