Asianet News TeluguAsianet News Telugu

మళ్ళీ పెరుగుతున్న క్రూడాయిల్.. నేడు స్థిరంగా ఇంధన ధరలు.. లీటరు ఎంతంటే..?

బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ $2.85 లేదా 3.4% పెరిగి బ్యారెల్ $80.84 డాలర్లకి 11:41 am EDT [1641 GMT]కి చేరుకున్నాయి. US వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) క్రూడ్ ఫ్యూచర్స్ $2.49 లేదా 3.4% లాభపడి $75.66కి చేరుకుంది.

Petrol Diesel Prices  today: Crude again crossed 80  check latest prices here
Author
First Published Dec 14, 2022, 9:01 AM IST

నేడు అంటే డిసెంబర్ 14న ఇండియాలోని అన్నీ  మెట్రో నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి.  దాదాపు ఆరు నెలలుగా ఇంధన ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఈ ఏడాది మే 21న దేశ వ్యాప్తంగా ఇంధన ధరల్లో చివరి మార్పు జరిగింది, ఆ సమయంలో ఆర్థిక మంత్రి  నిర్మలా సీతారామన్  పెట్రోల్‌పై లీటరుకు రూ.8, డీజిల్‌పై రూ.6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించారు. 

దీంతో ఢిల్లీలో పెట్రోలు ధర రూ.96.72, , డీజిల్ ధర రూ.89.62. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.31, డీజిల్ ధర రూ.94.27. చెన్నైలో పెట్రోల్  ధర రూ.102.63, డీజిల్ ధర రూ.94.24. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.106.03, డీజిల్ ధర రూ.92.76గా ఉన్నాయి.

హైదరాబాద్: లీటరు పెట్రోల్ ధర  రూ.109.66. డీజిల్ ధర లీటరుకి రూ.97.82

బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ $2.85 లేదా 3.4% పెరిగి బ్యారెల్ $80.84 డాలర్లకి 11:41 am EDT [1641 GMT]కి చేరుకున్నాయి. US వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) క్రూడ్ ఫ్యూచర్స్ $2.49 లేదా 3.4% లాభపడి $75.66కి చేరుకుంది.

పెట్రోల్, డీజిల్ ధరలు రాష్ట్రాల వారీగా మారుతుంటాయి.  విలువ ఆధారిత పన్ను (VAT), సరుకు రవాణా ఛార్జీలు, స్థానిక పన్నులు మొదలైన వివిధ ప్రమాణాలపై ధరలు ఆధారపడి ఉంటుంది. పెట్రోల్, డీజిల్ ధరలలో ఏవైనా మార్పులు ఉంటే ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుండి అమలు చేయబడతాయి. భారత్ పెట్రోలియం కార్పొరేషన్  లిమిటెడ్ ( BPCL ),  ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL), హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) సహా ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు అంతర్జాతీయ బెంచ్‌మార్క్ ధరలు,  ఫారెక్స్ రేట్లకు  అనుగుణంగా ధరలను ప్రతిరోజూ  సవరిస్తాయి.

కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినప్పటి నుండి కొన్ని రాష్ట్రాలు ఇంధనాలపై వ్యాట్ ధరలను కూడా తగ్గించాయి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios