Asianet News TeluguAsianet News Telugu

వాహనదారులకు మరింత రిలీఫ్.. పెట్రోల్ 44 పైసలు, డీజిల్ 41 పైసలు తగ్గింపు.. కొత్త ధరలు ఇవే..

హిమాచల్ ప్రదేశ్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.0.32 పెరిగి రూ.95.93కి, డీజిల్ ధర రూ.0.27 పెరిగి రూ.82.15కి చేరింది. పశ్చిమ బెంగాల్‌లో లీటర్ పెట్రోల్ రూ.0.44 తగ్గి రూ.106.82కి, డీజిల్ రూ.0.41 తగ్గి రూ.93.49కి చేరింది. 

Petrol Diesel Prices today: Change in fuel Price in Noida-Ghaziabad Check Your City Rates here
Author
First Published Nov 14, 2022, 8:06 AM IST

న్యూఢిల్లీ: నేడు అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్  ధరలు సోమవారం స్వల్పంగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు $ 0.75 (0.78 శాతం) డాలర్లు పెరిగి $ 96.74 డాలర్ల వద్ద, WTI $ 0.70 (0.79 శాతం) డాలర్లు పెరిగి  బ్యారెల్‌కు $ 89.66 డాలర్ల వద్ద ఉంది. ప్రభుత్వ ఆయిల్ కంపెనీలు ఇండియాలో ఈ రోజు కొత్త పెట్రోల్, డీజిల్ రేట్లను విడుదల చేశాయి. దీంతో నేడు కూడా పెట్రోలు, డీజిల్ ధరల్లో పెద్దగా మార్పు లేదు.

హిమాచల్ ప్రదేశ్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.0.32 పెరిగి రూ.95.93కి, డీజిల్ ధర రూ.0.27 పెరిగి రూ.82.15కి చేరింది. పశ్చిమ బెంగాల్‌లో లీటర్ పెట్రోల్ రూ.0.44 తగ్గి రూ.106.82కి, డీజిల్ రూ.0.41 తగ్గి రూ.93.49కి చేరింది. మరోవైపు ఉత్తరప్రదేశ్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.0.28 తగ్గి రూ.96.35కి, డీజిల్ ధర రూ.89.52కి చేరింది. నేటికీ దేశంలోని  ప్రముఖ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు.

నాలుగు మెట్రో నగరాలలో పెట్రోల్-డీజిల్ ధరలు
-ఢిల్లీలో పెట్రోల్ ధర రూ. 96.72, డీజిల్ ధర లీటరుకు రూ. 89.62 
-ముంబైలో పెట్రోల్ ధర రూ. 106.31, డీజిల్ ధర రూ.94.27 
- కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ. 106.03, డీజిల్ ధర రూ. 92.76
-చెన్నైలో పెట్రోల్ ధర రూ. 102.63, డీజిల్ ధర లీటరుకు రూ. 94.24

ఈ నగరాల్లో కొత్త ధరలు 
- నోయిడాలో పెట్రోల్ ధర రూ. 96.69, డీజిల్ ధర లీటరుకు రూ. 89.86.
–ఘజియాబాద్‌లో పెట్రోల్ ధర  రూ.96.23, లీటర్ డీజిల్‌ ధర రూ.89.42.
-లక్నోలో లీటరు పెట్రోల్ ధర రూ.96.36, డీజిల్ ధర రూ.89.56గా ఉంది.
–పాట్నాలో లీటరు పెట్రోల్ ధర రూ.107.24, డీజిల్ ధర రూ.94.04గా ఉంది.
–పోర్ట్ బ్లెయిర్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.84.10, డీజిల్ ధర రూ.79.74గా ఉంది.
-హైదరాబాద్‌లో పెట్రోలు ధర రూ.109.66, డీజిల్ ధర రూ.97.82

ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు పెట్రోల్, డీజిల్ ధరలను సమీక్షించి కొత్త ధరలు జారీ చేస్తారు. పెట్రోల్, డీజిల్ ధరలకు ఎక్సైజ్ సుంకం, డీలర్ కమీషన్, వ్యాట్ ఇతర జోడించిన తర్వాత దాని ధర అసలు ధర కంటే దాదాపు రెట్టింపు అవుతుంది. పెట్రోలు, డీజిల్‌ ఇంత ఎక్కువగా ఉండటానికి ఇదే కారణం.

Follow Us:
Download App:
  • android
  • ios