Asianet News TeluguAsianet News Telugu

మండుతున్న క్రూడాయిల్..మీ వాహనంలో పెట్రోల్-డీజిల్ నింపే ముందు నేటి కొత్త ధరలు తెలుసుకోండి..

ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు ఇంధన ధరల సవరణను ప్రకటిస్తాయి, అయితే జనవరి 18న బుధవారం పెట్రోల్, డీజిల్ ధరలను స్థిరంగా కొనసాగించాయి.

Petrol Diesel Prices Today: 18 January 2023 Check latest rates in your city here-sak
Author
First Published Jan 18, 2023, 9:52 AM IST

న్యూఢిల్లీ : చైనా కఠినమైన కోవిడ్ -19 నియంత్రణల సడలింపు ప్రపంచంలోని అగ్ర ఆయిల్ దిగుమతిదారులో ఇంధన డిమాండ్‌ను పునరుద్ధరించడానికి దారితీస్తుందనే ఆశావాదంతో బుధవారం ఆయిల్ ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ గత సెషన్‌లో 1.7 శాతం ర్యాలీని అనుసరించి 0151 GMT వద్ద బ్యారెల్‌కు 52 సెంట్లు లేదా 0.6 శాతం పెరిగి $86.44 డాలర్ల వద్ద ఉన్నాయి.

ఈ పెంపు  భారత్‌లో ఇంధన ధరలపై ఎలాంటి ప్రభావం చూపలేదు. ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు ఇంధన ధరల సవరణను ప్రకటిస్తాయి, అయితే జనవరి 18న బుధవారం పెట్రోల్, డీజిల్ ధరలను స్థిరంగా కొనసాగించాయి.

 గత ఏడాది మేలో కేంద్ర ఆర్థిక మంత్రి  నిర్మలా సీతారామన్  దేశవ్యాప్తంగా  పెట్రోల్‌పై లీటరుకు రూ.8, డీజిల్‌పై లీటరుకు రూ.6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించారు. చైనా 2022 జీడీపీ గణాంకాలను విడుదల చేసింది.  అయితే ఈ ఏడాది అక్కడ చమురుకు డిమాండ్ పెరుగుతుందని అంచనా. అంతర్జాతీయ స్థాయిలో క్రూడాయిల్ ధర పెరగడానికి ఇదే కారణం. ప్రపంచంలోనే చైనా అతిపెద్ద క్రూడాయిల్  దిగుమతిదారుగా ఉంది, ఇటీవల అక్కడ కరోనాకు సంబంధించిన ఆంక్షలు సడలించబడ్డాయి.

18 జనవరి రోజున పెట్రోల్, డీజిల్ తాజా ధర
జనవరి 18 బుధవారం తాజా ధరల అప్ డేట్ ప్రకారం, ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 96.72 కాగా, డీజిల్ ధర లీటరుకు రూ. 89.62. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 106.31 ఉండగా, లీటర్ డీజిల్‌కు రూ. 94.27.
బెంగళూరులో కూడా పెట్రోల్ ధర రూ.100 మార్కుకు దాటి  లీటర్ పెట్రోల్‌కు రూ.101.94, డీజిల్‌ ధర రూ.87.89.

ఇతర నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు
నోయిడా
పెట్రోలు - లీటరు ధర  రూ.96.79
డీజిల్ - లీటరు ధర   రూ.89.96

గుర్గావ్
పెట్రోలు - లీటరు ధర   రూ.97.18
డీజిల్ - లీటరు ధర   రూ.90.05

చండీగఢ్
పెట్రోలు - లీటరు ధర  రూ.96.20
డీజిల్ - లీటరు ధర   రూ.84.26

చెన్నై
పెట్రోలు - లీటరు ధర   రూ.102.63
డీజిల్ - లీటరు ధర   రూ.94.24

కోల్‌కతా
పెట్రోలు - లీటరు ధర   రూ.106.03
డీజిల్ - లీటరు ధర రూ. 92.76

లక్నో
పెట్రోలు - లీటరు ధర రూ.96.62
డీజిల్ - లీటరు ధర రూ.89.81

హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.66, డీజిల్ ధర రూ.97.82.

పెట్రోల్, డీజిల్ ధరలు రాష్ట్రం నుండి రాష్ట్రానికి మారుతుంటాయి. ఇంకా విలువ ఆధారిత పన్ను (VAT), సరుకు రవాణా ఛార్జీలు, స్థానిక పన్నులు మొదలైన వివిధ ప్రమాణాలపై ఆధారపడి ఉంటుంది. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) సహా ప్రభుత్వ రంగ OMCలు ( IOCL)  హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) అంతర్జాతీయ బెంచ్‌మార్క్ ధరలు, ఫారెక్స్ రేట్లకు అనుగుణంగా ప్రతిరోజూ ధరలను సవరిస్తాయి. పెట్రోల్, డీజిల్ ధరలలో ఏవైనా మార్పులు ఉంటే ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుండి అమలు చేయబడతాయి.

Follow Us:
Download App:
  • android
  • ios