Asianet News TeluguAsianet News Telugu

పెట్రోల్-డీజిల్ కొత్త ధరలు.. నేడు మీ నగరంలో లీటరు ధర ఎంతంటే..?

ఎక్సైజ్ సుంకం తగ్గించడానికి ముందు ఢిల్లీలో పెట్రోలు ధర లీటర్ రూ. 105.41 ప్రస్తుతం రూ. 96.72గా ఉంది, డీజిల్ ధర రూ. 96.67 నుండి ఇప్పుడు రూ. 89.62గా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 111.35 నుండి రూ. 106.31కి చేరగా, డీజిల్ ధర రూ. 97.28 నుండి రూ. 94.27 వద్ద ఉంది.
 

Petrol Diesel Prices stable  in country check latest rate in your city today?
Author
Hyderabad, First Published Aug 22, 2022, 9:08 AM IST

ఆగస్ట్ 22న అంటే నేడు చమురు మార్కెటింగ్ కంపెనీలు గత మూడు నెలలకు పైగా పెట్రోల్, డీజిల్ ధరలను స్థిరంగా ఉంచాయి.  మహారాష్ట్రలో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ధర తగ్గింపు చేసింది. గత నెల ప్రారంభంలో పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 చొప్పున విలువ ఆధారిత పన్ను (వ్యాట్) తగ్గింపును ప్రకటించింది. వ్యాట్‌లో కోత వల్ల మహారాష్ట్ర రాష్ట్ర ఖజానాకు వార్షిక ప్రాతిపదికన రూ.6,000 కోట్లు నష్టం వాటిల్లనుంది. దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పెట్రోలుపై లీటరుకు రూ. 8, డీజిల్‌పై రూ. 6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు మే 21 ప్రకటించినప్పటి నుండి ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి. 

ఎక్సైజ్ సుంకం తగ్గించడానికి ముందు ఢిల్లీలో పెట్రోలు ధర లీటర్ రూ. 105.41 ప్రస్తుతం రూ. 96.72గా ఉంది, డీజిల్ ధర రూ. 96.67 నుండి ఇప్పుడు రూ. 89.62గా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 111.35 నుండి రూ. 106.31కి చేరగా, డీజిల్ ధర రూ. 97.28 నుండి రూ. 94.27 వద్ద ఉంది.

భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ( BPCL ), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ( HPCL ) సహా ప్రభుత్వ రంగ OMC లు అంతర్జాతీయ బెంచ్‌మార్క్ ధరలు, విదేశీ మారకపు ధరలకు అనుగుణంగా ప్రతిరోజూ ఇంధన ధరలను సవరిస్తాయి. పెట్రోల్ అండ్ డీజిల్ ధరలలో ఏవైనా మార్పులు ఉంటే  ప్రతి రోజు ఉదయం 6 గంటల నుండి అమలు చేస్తాయి. వ్యాట్ లేదా సరుకు రవాణా ఛార్జీలు వంటి స్థానిక పన్నుల కారణంగా రిటైల్ పెట్రోల్, డీజిల్ ధరలు రాష్ట్రాల నుండి రాష్ట్రాలకు మారుతూ ఉంటాయి. ఆగస్టు 2న ప్రభుత్వం డీజిల్ ఎగుమతిపై లీటరుకు రూ. 5కి పన్ను తగ్గించి, ఏటీఎఫ్‌పై పన్నును రద్దు చేసింది. అయితే పెట్రోలియం క్రూడ్‌పై అదనపు ఎక్సైజ్ సుంకాన్ని (సెస్) స్వల్పంగా టన్నుకు రూ.17,000 నుంచి రూ.17,750కి పెంచింది.  

ముంబైలో పెట్రోల్ ధర లీటరుకు రూ. 106.31, డీజిల్ ధర లీటరుకు రూ. 94.27

ఢిల్లీలో పెట్రోలు ధర లీటరుకు రూ. 96.72, డీజిల్ ధర రూ. 89.62

చెన్నైలో పెట్రోలు ధర లీటరుకు రూ. 102.63, డీజిల్ ధర రూ. 94.24

కోల్‌కతాలో పెట్రోల్ ధర లీటరుకు రూ. 106.03, డీజిల్ ధర రూ. 92.76

బెంగళూరులో  పెట్రోలు లీటరుకు రూ. 101.94, డీజిల్ లీటరుకు రూ. 87.89

లక్నోలో పెట్రోలు లీటరుకు రూ. 96.57, డీజిల్  లీటరుకు రూ. 89.76

నోయిడాలో పెట్రోల్ ధర రూ. 96.79, డీజిల్ ధర రూ. 89.96

గురుగ్రామ్ లో పెట్రోల్ ధర రూ. 97.18, డీజిల్ ధర రూ. 90.05

చండీగఢ్ లో పెట్రోల్ ధర రూ. 96.20, డీజిల్ ధర రూ. 84.26

హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ. 109.66, డీజిల్ ధర రూ. 97.82.

ముడి చమురు ధర
గత మూడు సెషన్లుగా లాభపడిన ముడి చమురు ధరలు సోమవారం ఉదయం పడిపోయాయి. ప్రపంచ మాంద్యం భయాల మధ్య ధర తగ్గింది. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ $1.17 తగ్గి బ్యారెల్ $95.55 వద్ద ట్రేడవుతున్నాయి. WTI క్రూడ్ బ్యారెల్ $89.29 వద్ద ఉంది, రాయిటర్స్ ప్రకారం $1.15 పడిపోయింది. 

Follow Us:
Download App:
  • android
  • ios