పంజాబ్‌, కేరళ ప్రభుత్వాలు గతేడాది పెట్రోల్‌, డీజిల్‌పై సెస్‌ విధించాయి. కేరళలో ఆర్థిక సంవత్సరం మొదటి రోజు ఏప్రిల్ 1 నుండి ఇంధన ధరలు రూ.2 మేర పెరగనున్నాయి. ముడి చమురు ధర బ్యారెల్‌కు 80 డాలర్లకు చేరువైంది.  బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్ కు $79.77 డాలర్లుగా ఉంది. అదే సమయంలో WTI క్రూడ్ బ్యారెల్‌కు $ 75.67 డాలర్ల వద్ద ఉంది. 

భారతదేశంలో నేడు శనివారం పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. గత ఏడాది మే 2022లో ఇంధన ధరలు చివరిసారిగా సవరించినప్పటి నుండి దాదాపు 10 నెలల పాటు ఇంధన ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్ ధర లీటరుకు రూ.106.31, డీజిల్ ధర రూ.94.27. దేశ రాజధాని ఢిల్లీలో ఇంధన ధరలు వరుసగా 1 లీటర్ పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62 వద్ద ఉన్నాయి.

ప్రస్తుతం చెన్నైలో 1 లీటర్ పెట్రోల్ ధర రూ.102.63, డీజిల్ ధర రూ.94.24. కోల్‌కతాలో పెట్రోల్‌ ధర లీటర్‌కు రూ.106.03, లీటరు డీజిల్ ధర రూ.92.76గా ఉంది.

కాగా పంజాబ్‌, కేరళ ప్రభుత్వాలు గతేడాది పెట్రోల్‌, డీజిల్‌పై సెస్‌ విధించాయి. కేరళలో ఆర్థిక సంవత్సరం మొదటి రోజు ఏప్రిల్ 1 నుండి ఇంధన ధరలు రూ.2 మేర పెరగనున్నాయి.

హైదరాబాద్ లో పెట్రోల్ ధర రూ.109.66, డీజిల్ ధర రూ.97.82

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ముడి చమురు ధర బ్యారెల్‌కు 80 డాలర్లకు చేరువైంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్ కు $79.77 డాలర్లుగా ఉంది. అదే సమయంలో WTI క్రూడ్ బ్యారెల్‌కు $ 75.67 డాలర్ల వద్ద ఉంది. అయితే దీని తర్వాత కూడా భారత మార్కెట్‌లో చమురు ధరల్లో ఎలాంటి మార్పు కనిపించలేదు. 

భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ( BPCL ), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL), హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) సహా ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMCలు) అంతర్జాతీయ బెంచ్‌మార్క్ ధరలు అండ్ ఫారెక్స్ రేట్లకు అనుగుణంగా ప్రతిరోజు ధరలను సవరిస్తాయి

ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు పెట్రోలు, డీజిల్ ధరలను మార్చి కొత్త రేట్లు జారీ చేస్తారు. పెట్రోల్, డీజిల్ ధరలకు ఎక్సైజ్ సుంకం, డీలర్ కమీషన్, వ్యాట్ ఇతర జోడించిన తర్వాత దాని ధర అసలు ధర కంటే దాదాపు రెట్టింపు అవుతుంది. పెట్రోలు, డీజిల్‌ను మనం ఇంత ఎక్కువ ధరకు కొనుగోలు చేయాల్సి రావడానికి ఇదే కారణం.