ఆయిల్‌ కంపెనీల ధరల ప్రకారం.. దేశరాజధానిలో పెట్రోల్‌ ధర తొలిసారిగా 79మార్క్‌ను దాటింది.

పెట్రోల్, ధరలు మళ్లీ ఆకాశాన్నంటాయి. ఇప్పటి వరకు ఎన్నడూ లేనంత గరిష్ట స్థాయికి పెట్రోల్, డీజిల్ ధరలు చేరుకున్నాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగుతుండటంతో పాటు చమురు రవాణాపై విధిస్తున్న అధిక ఎక్సైజ్‌ సుంకం కారణంగా దేశంలో పెట్రోల్, డీజిల్‌ ధరలు నానాటికీ పెరుగుతున్నాయి. దీనికి తోడు రూపాయి పతనమవడం కూడా ఇంధన ధరలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఫలితంగా దేశీయ మార్కెట్లో పెట్రోల్‌, డీజిల్ ధరలు ఆల్‌టైం గరిష్టానికి చేరాయి.

ఆయిల్‌ కంపెనీల ధరల ప్రకారం.. దేశరాజధానిలో పెట్రోల్‌ ధర తొలిసారిగా 79మార్క్‌ను దాటింది. సోమవారం నాటి రోజువారీ సవరణల ప్రకారం.. దిల్లీలో నేడు లీటర్‌ పెట్రోల్‌ ధర 31 పైసలు పెరిగి రూ. 79.15గా ఉంది. ముంబయిలో రూ. 86.56గా ఉంది. భారత్‌లో ఇప్పటివరకూ ఏ రాష్ట్రంలోనూ పెట్రోల్‌ ధర ఇంత అధిక ధర పలకలేదు. ఇక కోల్‌కతాలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 82.06, చెన్నైలో రూ. 82.24గా ఉంది. డీజిల్‌ ధర కూడా మళ్లీ రికార్డు స్థాయిలో పెరిగింది. సోమవారం దిల్లీలో లీటర్ డీజిల్ ధర 39 పైసలు పెరిగి రూ. 71.15గా ఉండగా.. ముంబయిలో రూ. 75.54, చెన్నైలో రూ. 75.19, కోల్‌కతాలో రూ. 74గా ఉంది.