Asianet News TeluguAsianet News Telugu

నేడు పెట్రోల్, డీజిల్ కొత్త ధరలు: ఢిల్లీ నుండి హైదరాబాద్ వరకు లీటరు ధర ఎంతో తెలుసుకోండి..

ఈ ఏడాది మే 21న దేశ వ్యాప్తంగా ఇంధన ధరల్లో చివరిసారిగా మార్పు వచ్చింది, ఆ సమయంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పెట్రోల్‌పై లీటరుకు రూ.8, డీజిల్‌పై రూ.6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. 

Petrol Diesel Price update Today: Fuel prices steady Check rates from Delhi, Mumbai and other cities
Author
First Published Nov 26, 2022, 8:54 AM IST

గత ఆరు నెలలుగా  అంటే నేటి 26 నవంబర్ 2022 (శనివారం)న పెట్రోల్, డీజిల్ ధరలు యధాతధంగా కొనసాగుతున్నాయి. 
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలో  హెచ్చుతగ్గుల మధ్య ,  భారతీయ చమురు కంపెనీలు ఈరోజు ఇంధన ధరలను స్థిరంగా ఉంచాయి. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై సహా దేశవ్యాప్తంగా  ధరలో ఎటువంటి మార్పు లేదు.

ఈ ఏడాది మే 21న దేశ వ్యాప్తంగా ఇంధన ధరల్లో చివరిసారిగా మార్పు వచ్చింది, ఆ సమయంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పెట్రోల్‌పై లీటరుకు రూ.8, డీజిల్‌పై రూ.6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినప్పటి నుండి కొన్ని రాష్ట్రాలు  ఇంధనాలపై వ్యాట్ ధరలు కూడా తగ్గించాయి.

ఇప్పుడు పెట్రోల్ ధర షిల్లాంగ్‌లో లీటరుకు రూ. 96.83, డీజిల్ ధర ఇప్పుడు రూ. 84.72గా ఉంది. మహారాష్ట్ర ప్రభుత్వం జూలైలో పెట్రోల్‌పై విలువ ఆధారిత పన్ను (వ్యాట్) లీటర్‌కు రూ.5, డీజిల్‌పై రూ.3 తగ్గింపును ప్రకటించింది. స్థానిక పన్నులు, విలువ ఆధారిత పన్ను (వ్యాట్), సరుకు రవాణా ఛార్జీలు మొదలైన చాలా అంశాలపై ఆధారపడి ప్రతి రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు మారుతూ ఉంటాయి.


మెట్రో నగరాలలో పెట్రోల్, డీజిల్ ధరలు

ముంబై: పెట్రోల్ ధర లీటరుకు రూ. 106.31, డీజిల్ ధర లీటరుకు 94.27

ఢిల్లీ: పెట్రోలు ధర లీటరుకు రూ. 96.72, డీజిల్ ధర రూ. 89.62

చెన్నై: పెట్రోలు ధర లీటరుకు రూ. 102.63, డీజిల్ ధర రూ. 94.24

కోల్‌కతా: పెట్రోల్ ధర లీటరుకు రూ. 106.03, డీజిల్ ధర రూ. 92.76

బెంగళూరు: పెట్రోలు ధర లీటరుకు రూ. 101.94, డీజిల్ ధర లీటరుకు రూ. 87.89

లక్నో: పెట్రోలు ధర లీటరుకు రూ. 96.57, డీజిల్ ధర రూ. 89.76

నోయిడా: పెట్రోల్ ధర రూ. 96.79, డీజిల్ ధర రూ. 89.96

గురుగ్రామ్: పెట్రోల్ ధర రూ. 97.18, డీజిల్ ధర రూ. 90.05

చండీగఢ్: పెట్రోల్ ధర రూ. 96.20, డీజిల్ ధర రూ. 84.26

హైదరాబాద్ లో నేడు లీటర్ పెట్రోల్ ధర రూ.109.66, డీజిల్ ధర లీటరుకు రూ.97.82.

భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ( BPCL ), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL), హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) సహా ప్రభుత్వ రంగ OMCలు అంతర్జాతీయ బెంచ్‌మార్క్ ధరలు, విదేశీ మారకపు ధరలకు అనుగుణంగా ఇంధన ధరలను ప్రతిరోజూ సవరిస్తాయి. పెట్రోల్, డీజిల్ ధరలలో ఏవైనా మార్పులు ఉంటే ప్రతి రోజు ఉదయం 6 గంటల నుండి అమలు చేయబడతాయి. VAT లేదా సరుకు రవాణా ఛార్జీల వంటి స్థానిక పన్నుల కారణంగా రిటైల్ పెట్రోల్, డీజిల్ ధరలు రాష్ట్రాల నుండి రాష్ట్రాలకు మారుతూ ఉంటాయి.

Follow Us:
Download App:
  • android
  • ios