Asianet News TeluguAsianet News Telugu

ఇంధన ధరల అప్‌డేట్: వాహనదారులకు రిలీఫ్.. పెట్రోల్, డీజిల్ లీటరు ధర నేడు ఎంతో తెలుసుకోండి..

అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధర తగ్గుముఖం పట్టింది. WTI క్రూడ్ ధర బ్యారెల్‌కు $78కి, బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు $85కి పడిపోయింది.భారతదేశంలో పెట్రోలు, డీజిల్ ధరలలో వరుసగా 194వ రోజు ఎటువంటి మార్పు లేదు.  
 

 Petrol Diesel Price Update: new petrol diesel prices issued know latest rates here
Author
First Published Dec 2, 2022, 9:25 AM IST

అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధర పడిపోతున్న నేపథ్యంలో భారతీయ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నేడు పెట్రోల్, డీజిల్ తాజా ధరలను విడుదల చేశాయి. అయితే ఇండియన్ ఆయిల్ కంపెనీలు శుక్రవారం డిసెంబర్ 2న ఉదయం పెట్రోల్, డీజిల్ ధరలను స్థిరంగా ఉంచాయి.

భారతదేశంలో పెట్రోలు, డీజిల్ ధరలలో వరుసగా 194వ రోజు ఎటువంటి మార్పు లేదు.  అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధర తగ్గుముఖం పట్టింది. WTI క్రూడ్ ధర బ్యారెల్‌కు $78కి, బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు $85కి పడిపోయింది.

అంతకుముందు మే 21న ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. లీటర్ పెట్రోల్‌పై రూ.8, డీజిల్‌పై రూ.6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించారు. అప్పటి నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. దీని తర్వాత దేశంలో లీటరుకు డీజిల్ ధర రూ.9.50, పెట్రోల్ ధర రూ.7 తగ్గింది. కేంద్రం ప్రకటన తర్వాత రాజస్థాన్, మహారాష్ట్ర, ఒడిశా, కేరళ ప్రభుత్వాలు కూడా పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ని తగ్గించాయి.

ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.106.31, డీజిల్ రూ.94.27కు లభిస్తోంది. కోల్‌కతాలో పెట్రోలు ధర రూ.106.03, డీజిల్ ధర లీటరుకు రూ.92.76గా ఉంది. మరోవైపు చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.63, డీజిల్ ధర రూ.94.24గా ఉంది.

 రాజస్థాన్‌లోని గంగానగర్‌, హనుమాన్‌గఢ్‌ జిల్లాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు అత్యధికంగా ఉన్నాయి. గంగానగర్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.113.48, డీజిల్‌ ధర రూ.98.24. హనుమాన్‌గఢ్‌ జిల్లాలో లీటర్‌ పెట్రోల్‌ రూ.112.54కు, డీజిల్‌ రూ.97.39గా ఉంది.

మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరలు పోర్ట్ బ్లెయిర్‌లో అత్యంత తక్కువగా ఉన్నాయి, ఇక్కడ పెట్రోల్ ధర లీటరుకు రూ.84.10, డీజిల్ ధర లీటరుకు రూ.79.74గా ఉంది.

నేటి పెట్రోల్ డీజిల్ ధరలు ఎంతంతే ?

ఢిల్లీ: లీటర్ పెట్రోల్ ధరరూ.96.72, డీజిల్ ధరరూ.89.62.

ముంబై: లీటర్ పెట్రోల్ ధర రూ.106.31, డీజిల్ ధర రూ.94.27.

కోల్‌కతా: లీటర్ పెట్రోల్ ధర రూ.106.03, డీజిల్ ధర రూ.92.76.

చెన్నై: లీటర్ పెట్రోల్ ధర రూ.102.63, డీజిల్ ధర రూ.94.24.

హైదరాబాద్: లీటర్ పెట్రోల్ ధర రూ.109.66, డీజిల్ ధర రూ.97.82.

బెంగళూరు: లీటర్ పెట్రోల్ ధర రూ.101.94, డీజిల్ ధర రూ.87.89.

తిరువనంతపురం: లీటర్ పెట్రోల్ ధర రూ.107.71, డీజిల్ ధర రూ.96.52.

పోర్ట్ బ్లెయిర్: లీటర్ పెట్రోల్ ధర రూ. 84.10, డీజిల్ ధర రూ.79.74.

భువనేశ్వర్: లీటర్ పెట్రోల్ ధర రూ.103.19, డీజిల్ ధర రూ.94.76.

చండీగఢ్: లీటర్ పెట్రోల్ ధర రూ.96.20, డీజిల్ ధర రూ.84.26.

లక్నో: లీటర్ పెట్రోల్ ధర రూ.96.57, డీజిల్ ధర రూ.89.76.

నోయిడా: లీటర్ పెట్రోల్ ధర రూ.96.57, డీజిల్ ధర రూ.89.96.

జైపూర్: లీటర్ పెట్రోల్ ధర రూ.108.48, డీజిల్ ధర రూ.93.72.

పాట్నా: లీటర్ పెట్రోల్ ధర రూ.107.24, డీజిల్ ధర రూ.94.04

గురుగ్రామ్: లీటర్ పెట్రోల్ ధర రూ. 97.18, డీజిల్ ధర రూ. 90.05 లీటరు.

 ఎక్సైజ్‌ డ్యూటీ, డీలర్‌ కమీషన్‌, ఇతర చార్జీలు కలిపితే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు అసలు ధర కంటే దాదాపు రెట్టింపు అవుతాయి. విదేశీ మారకపు ధరలతో పాటు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల ఆధారంగా పెట్రోల్, డీజిల్ ధరలను ప్రతిరోజూ  సవరిస్తుంటారు.

పెట్రోల్, డీజిల్ ధరలను ప్రతిరోజూ ఉదయం సమీక్షించిన తరువాత ఏవైనా మార్పులు ఉంటే ఉదయం 6 గంటల నుండి అమలు చేస్తాయి. మీరు ప్రతిరోజూ పెట్రోల్, డీజిల్ ధరను SMS ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఇండియన్ ఆయిల్ కస్టమర్లు మీ సిటీ కోడ్‌తో పాటు RSPని టైప్ చేసి 9224992249 నంబర్‌కు, BPCL కస్టమర్‌లు RSPని టైప్ చేసి మీ సిటీ కోడ్ ఎంటర్ చేసి  9223112222 నంబర్‌కు ఎస్‌ఎం‌ఎస్ పంపడం ద్వారా సమాచారాన్ని పొందవచ్చు. 

Follow Us:
Download App:
  • android
  • ios