Asianet News TeluguAsianet News Telugu

పెట్రోల్ డీజిల్ ధరల అప్‌డేట్: నేడు లీటరు ధర పెరిగిందా తగ్గిందా తెలుసుకొండి..

అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధర తగ్గుముఖం పట్టింది. WTI క్రూడ్ ధర బ్యారెల్‌కు $78డాలర్లకి, బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు $85డాలర్లకి పడిపోయింది.

Petrol Diesel Price Update: New petrol, diesel prices announced, know all details here
Author
First Published Dec 1, 2022, 9:23 AM IST

అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధర తగ్గుతున్న నేపథ్యంలో భారతీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు నేడు పెట్రోల్, డీజిల్ తాజా ధరలను విడుదల చేశాయి. అయితే, భారత ఆయిల్ కంపెనీలు గురువారం (డిసెంబర్ 1) పెట్రోల్, డీజిల్ ధరలను స్థిరంగా కొనసాగించాయి.

భారతదేశంలో  వరుసగా 193వ రోజు పెట్రోలు, డీజిల్ ధరలలో ఎటువంటి మార్పు లేదు. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధర తగ్గుముఖం పట్టింది. WTI క్రూడ్ ధర బ్యారెల్‌కు $78డాలర్లకి, బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు $85డాలర్లకి పడిపోయింది.

అంతకుముందు మే 21న ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. లీటర్ పెట్రోల్‌పై రూ.8, డీజిల్‌పై రూ.6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించారు. అప్పటి నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా దిగోచ్చాయి.  కేంద్రం ప్రకటన తర్వాత రాజస్థాన్, మహారాష్ట్ర, ఒడిశా, కేరళ ప్రభుత్వాలు కూడా పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ని తగ్గించాయి.

ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.31, డీజిల్ ధర రూ.94.27గా ఉంది. కోల్‌కతాలో పెట్రోలు ధర రూ.106.03, డీజిల్ ధర లీటరుకు రూ.92.76గా ఉంది. మరోవైపు చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.63, డీజిల్ ధర రూ.94.24గా ఉంది.

భారతదేశంలో అత్యధిక ధరకి పెట్రోల్, డీజిల్ ధరలు 
రాజస్థాన్‌లోని గంగానగర్‌, హనుమాన్‌గఢ్‌ జిల్లాల్లో అత్యధిక ధరకి పెట్రోల్‌, డీజిల్‌ విక్రయాలు జరుగుతున్నాయి. గంగానగర్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.113.48, డీజిల్‌ ధర రూ.98.24. హనుమాన్‌గఢ్‌ జిల్లాలో లీటర్‌ పెట్రోల్‌ రూ.112.54కు, డీజిల్‌ రూ.97.39కి విక్రయిస్తున్నారు.

నేటి పెట్రోల్ డీజిల్ ధరలు
ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62.

ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.31, డీజిల్ ధర రూ.94.27.

కోల్‌కతాలో  లీటర్ పెట్రోల్ ధర రూ.106.03, డీజిల్ ధర రూ.92.76.

చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.63, డీజిల్ ధర రూ.94.24.

హైదరాబాద్: లీటర్ పెట్రోల్ ధర రూ.109.66, డీజిల్ ధర  రూ.97.82.

బెంగళూరు: లీటర్ పెట్రోల్ ధర రూ.101.94, డీజిల్ ధర  రూ.87.89.

తిరువనంతపురం: లీటర్ పెట్రోల్ ధర రూ.107.71, డీజిల్ ధర  రూ.96.52.

పోర్ట్ బ్లెయిర్: లీటర్ పెట్రోల్ ధర  రూ. 84.10 మరియు డీజిల్ ధర రూ.79.74.

భువనేశ్వర్: లీటర్ పెట్రోల్ ధర రూ.103.19, డీజిల్ ధర రూ.94.76.

చండీగఢ్: లీటర్ పెట్రోల్ ధర రూ.96.20, డీజిల్ ధర రూ.84.26.

లక్నో: లీటర్ పెట్రోల్ ధర రూ.96.57, డీజిల్ ధర రూ.89.76.

నోయిడా: లీటర్ పెట్రోల్ ధర రూ.96.57, డీజిల్ ధర రూ.89.96.

జైపూర్: లీటర్ పెట్రోల్ ధర రూ.108.48, డీజిల్ ధర రూ.93.72.

పాట్నా: లీటర్ పెట్రోల్ ధర  రూ.107.24, డీజిల్ ధర రూ.94.04

గురుగ్రామ్: లీటర్ పెట్రోల్ ధర రూ. 97.18, డీజిల్ ధర రూ. 90.05 లీటరు.

 ఎక్సైజ్‌ డ్యూటీ, డీలర్‌ కమీషన్‌, ఇతర చార్జీలు కలిపితే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు అసలు ధర కంటే దాదాపు రెట్టింపు అవుతాయి. విదేశీ మారకపు ధరలతో పాటు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల ఆధారంగా పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతిరోజూ సమీక్షిస్తుంటారు.

పెట్రోల్, డీజిల్ ధరలను ప్రతిరోజూ ఉదయం సమీక్షించిన తరువాత ఏవైనా మార్పులు ఉంటే ఉదయం 6 గంటల నుండి అమలు చేస్తాయి. మీరు ప్రతిరోజూ పెట్రోల్, డీజిల్ ధరను SMS ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఇండియన్ ఆయిల్ కస్టమర్లు మీ సిటీ కోడ్‌తో పాటు RSPని టైప్ చేసి 9224992249 నంబర్‌కు, BPCL కస్టమర్‌లు RSPని టైప్ చేసి మీ సిటీ కోడ్ ఎంటర్ చేసి  9223112222 నంబర్‌కు ఎస్‌ఎం‌ఎస్ పంపడం ద్వారా సమాచారాన్ని పొందవచ్చు. 

Follow Us:
Download App:
  • android
  • ios