Asianet News TeluguAsianet News Telugu

స్థిరంగా ఇంధన ధరలు: నేడు ఢిల్లీ నుండి హైదరాబాద్ వరకు లీటరు ధరలు ఇవే..

 కేంద్రం పెట్రోల్‌పై లీటరుకు రూ. 8, డీజిల్‌పై రూ. 6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన తరువాత  మే 22న దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు చివరిసారిగా తగ్గాయి. దేశ వ్యాప్తంగా ఇంధన ధరలు స్థానిక పన్నుల బట్టి రాష్ట్రం నుండి రాష్ట్రానికి మారుతూ ఉంటాయి.
 

Petrol Diesel Price Today on January 25 2023: Fuel prices remain unchanged on Wednesday check latest prices here-sak
Author
First Published Jan 25, 2023, 8:39 AM IST

నేడు  పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా 249వ రోజు బుధవారం అంటే జనవరి 25న నేటికీ మారలేదు . 2022 మే 21న కేంద్రం పెట్రోల్‌పై లీటరుకు రూ. 8, డీజిల్‌పై రూ. 6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన తరువాత  మే 22న దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు చివరిసారిగా తగ్గాయి.  జూలై 14 2022న పెట్రోల్  పై రూ. 5, డీజిల్‌పై   రూ. 3 చొప్పున విలువ ఆధారిత పన్ను (వ్యాట్) తగ్గించిన తర్వాత మహారాష్ట్రలో ఇంధన ధరలు తగ్గాయి.

ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.31గా ఉండగా, డీజిల్ ధర రూ.94.27గా ఉంది.

కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.03, లీటర్ డీజిల్ ధర రూ.92.76. కాగా, చెన్నైలో పెట్రోల్ ధర రూ.102.63, డీజిల్ ధర రూ.94.24గా ఉన్నాయి. బెంగళూరులో పెట్రోల్ ధర రూ. 101.94, డీజిల్ ధర రూ. 87.89.

దేశ వ్యాప్తంగా ఇంధన ధరలు స్థానిక పన్నుల బట్టి రాష్ట్రం నుండి రాష్ట్రానికి మారుతూ ఉంటాయి.

ప్రతిరోజూ ఉదయం ఆరు గంటలకు ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ విదేశీ మారకపు రేట్లు, అంతర్జాతీయ బెంచ్‌మార్క్ ధరలకు అనుగుణంగా ఇంధన ధరలను సవరిస్తాయి.

ప్రముఖ నగరాల్లో ఈరోజు డీజిల్, పెట్రోల్ ధరలు:

చెన్నైలో  పెట్రోల్ ధర రూ.102.63, డీజిల్ ధర రూ.94.24

లక్నోలో  పెట్రోల్ ధర రూ.96.57,  డీజిల్ ధర రూ.89.76

విశాఖపట్నంలో  పెట్రోల్ ధర రూ.110.48,  డీజిల్ ధర రూ.98.27

అహ్మదాబాద్ లో పెట్రోల్ ధర రూ.96.63,  డీజిల్ ధర రూ.92.38

హైదరాబాద్ లో పెట్రోల్ ధర రూ.109.66, డీజిల్ ధర రూ.97.82

పాట్నాలో పెట్రోల్ ధర రూ.107.24, డీజిల్ ధర రూ.94.04

Follow Us:
Download App:
  • android
  • ios