Asianet News TeluguAsianet News Telugu

వరుసగా 248వ రోజు స్థిరంగా ఇంధన ధరలు.. హైదరాబాద్ లో పెట్రోలు, డీజిల్ లీటరుకి ఎంతంటే..?

ప్రతిరోజూ ఉదయం ఆరు గంటలకు ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ విదేశీ మారకపు రేట్లు, అంతర్జాతీయ బెంచ్‌మార్క్ ధరలకు అనుగుణంగా ఇంధన ధరలను సవరిస్తాయి.

Petrol Diesel Price Today on January 24 2023: Fuel prices remain unchanged on Tuesday check latest prices here-sak
Author
First Published Jan 24, 2023, 9:17 AM IST

నేడు వరుసగా 248వ రోజు మంగళవారం అంటే జనవరి 24 న పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. గత ఏడాది 2022 మే 21న కేంద్రం పెట్రోల్‌పై లీటరుకు రూ. 8, డీజిల్‌పై రూ. 6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన తర్వాత, గత ఏడాది మే 22న దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు చివరిసారిగా తగ్గాయి. తరువాత, మహారాష్ట్ర ప్రభుత్వం జూలై 14, 2022న పెట్రోల్  రూ. 5, డీజిల్‌పై  రూ. 3 చొప్పున వాల్యు ఆధారిత పన్ను (వ్యాట్) తగ్గించిన తర్వాత ఇంధన ధరలు తగ్గించబడ్డాయి.

ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.31గా ఉండగా, నగరంలో డీజిల్ ధర రూ.94.27గా ఉంది.

కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.03, లీటర్ డీజిల్ ధర రూ.92.76. కాగా, చెన్నైలో పెట్రోల్ ధర  రూ.102.63, డీజిల్ ధర రూ.94.24గా ఉన్నాయి. బెంగళూరులో పెట్రోల్ ధర రూ. 101.94, డీజిల్ ధర రూ. 87.89.

గ్లోబల్ మార్కెట్‌లో క్రూడ్  ధరలు పెరుగుతూనే ఉన్నాయి, బ్రెంట్ క్రూడ్ ధర మరోసారి బ్యారెల్‌కు $ 90 డాలర్లకి చేరువైంది. బ్రెంట్ క్రూడ్ 0116 GMT నాటికి బ్యారెల్‌కు 5 సెంట్లు పెరిగి $88.24 డాలర్లకి చేరుకోగా, US వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) క్రూడ్ 13 సెంట్లు పెరిగి బ్యారెల్‌కు $81.75డాలర్లకి చేరుకుంది.

దేశ వ్యాప్తంగా ఇంధన ధరలు స్థానిక పన్నుల బట్టి రాష్ట్రానికి నుండి రాష్ట్రానికి మారుతూ ఉంటాయి. ప్రతిరోజూ ఉదయం ఆరు గంటలకు ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ విదేశీ మారకపు రేట్లు, అంతర్జాతీయ బెంచ్‌మార్క్ ధరలకు అనుగుణంగా ఇంధన ధరలను సవరిస్తాయి.

ప్రముఖ నగరాల్లో ఈరోజు డీజిల్, పెట్రోల్ ధరలు:

బెంగళూరులో పెట్రోల్ ధర రూ.101.94, డీజిల్ ధర రూ.87.89

లక్నోలో పెట్రోల్ ధర రూ.96.57, డీజిల్ ధర రూ.89.76

విశాఖపట్నంలో  పెట్రోల్ ధర రూ.110.48, డీజిల్ ధర రూ.98.27

అహ్మదాబాద్ పెట్రోల్ ధర రూ.96.63, డీజిల్ ధర రూ.92.38

హైదరాబాద్ పెట్రోల్ ధర రూ.109.66, డీజిల్ ధర రూ.97.82

పాట్నాలో పెట్రోల్ ధర రూ.107.24, డీజిల్ ధర రూ.94.04

Follow Us:
Download App:
  • android
  • ios