Asianet News TeluguAsianet News Telugu

పడిపోతున్న క్రూడాయిల్.. త్వరలోనే ఇంధన ధరలు తగ్గనున్నాయా..? నేటి ధరలు ఇవే..

అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్  ధరల గురించి మాట్లాడితే  క్రూడాయిల్  ధర సుమారు $80 డాలర్ల స్థాయిలో ఉంది. పెట్రోలు, డీజిల్ ధరలు లీటరుకు దాదాపు రూ.12 నుంచి 14 వరకు తగ్గే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. 

Petrol Diesel Price today on 3 December 2022: Latest rates of petrol and diesel released know latest rate of your city
Author
First Published Dec 3, 2022, 9:27 AM IST

 నేటికీ వరుసగా 8 నెలల పాటు పెట్రోల్-డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. మరోవైపు  క్రూడాయిల్  ధరలలో స్థిరమైన క్షీణత అంతర్జాతీయ మార్కెట్‌ను శాసిస్తుంది. ఇదిలా ఉండగా ధరలను తగ్గించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని, దీంతో త్వరలో సామాన్య ప్రజలకు ఊరట లభిస్తుందని భావిస్తున్నారు.  

ధరలు ఎంత తగ్గుతాయి?
అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్  ధరల గురించి మాట్లాడితే  క్రూడాయిల్  ధర సుమారు $80 డాలర్ల స్థాయిలో ఉంది. పెట్రోలు, డీజిల్ ధరలు లీటరుకు దాదాపు రూ.12 నుంచి 14 వరకు తగ్గే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. 

మూడు కంపెనీలకు వచ్చిన నష్టం ఎంత?
అధికారిక సమాచారం ప్రకారం, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) ఏప్రిల్ నుండి సెప్టెంబర్ మధ్య సుమారు 21,201.18 కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూశాయి. 

 దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉంది. 
ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.31, డీజిల్ ధర లీటరుకు రూ.94.27. 
చెన్నైలో పెట్రోల్ ధర రూ.102.63, డీజిల్ ధర లీటరుకు రూ.94.24. 
కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.106.03, డీజిల్ ధర లీటరుకు రూ.92.76. 
పోర్ట్ బ్లెయిర్‌లో  లీటరు పెట్రోల్ ధర రూ.84.10, డీజిల్ ధర రూ.79.74గా ఉంది.  
హైదరాబాద్ లీటర్ పెట్రోల్ ధర రూ.109.66, డీజిల్ ధర రూ.97.82.
బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.101.94, డీజిల్ ధర రూ.87.89.
తిరువనంతపురంలో లీటర్ పెట్రోల్ ధర రూ.107.71, డీజిల్ ధర రూ.96.52.

అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్‌ ఆయిల్‌ ధరల ఆధారంగా ఆయిల్ మార్కెటింగ్‌ కంపెనీలు పెట్రోల్‌, డీజిల్‌ ధరలను సమీక్షించిన తర్వాత ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు కొత్త ధరలను  నిర్ణయిస్తాయి. 

పెట్రోల్, డీజిల్ ధరలకు ఎక్సైజ్ సుంకం, డీలర్ కమీషన్ ఇతర జోడించిన తర్వాత దాని ధర అసలు ధర కంటే దాదాపు రెట్టింపు అవుతుంది. విదేశీ మారకపు ధరలతో పాటు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలను బట్టి పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతిరోజూ మారుతూ ఉంటాయి.  

Follow Us:
Download App:
  • android
  • ios