నాలుగు రోజుల విరామం తరువాత  నేడు పెట్రోల్, డీజిల్ ధరలు సవరించాయి.   గ్లోబల్ మార్కెట్‌లో ముడి చమురు ధరలు దిగి రావడంతో  ఇంధన ధరలు    స్వల్పంగా తగ్గటానికి కారణమయ్యాయి.

ప్రభుత్వ నిర్వహణలో ఉన్న చమురు కంపెనీలు నాలుగు రోజుల విరామం తరువాత నేడు పెట్రోల్, డీజిల్ ధరలు సవరించాయి. గ్లోబల్ మార్కెట్‌లో ముడి చమురు ధరలు దిగి రావడంతో ఇంధన ధరలు స్వల్పంగా తగ్గటానికి కారణమయ్యాయి. ఈ రోజు లీటరు పెట్రోల్ పై 22 పైసలు, డీజిల్ పై 23 పైసలు తగ్గించాయి.

దేశ రాజధాని ఢీల్లీలో పెట్రోల్ ధర రూ.90.56 కాగా, డీజిల్ ధర లీటరుకు రూ.80.87, ముంబైలో పెట్రోల్ ధర రూ .96.98, డీజిల్ ధర లీటరుకు రూ .87.96 దిగోచ్చాయి. కోల్‌కతాలో పెట్రోల్ ధర లీటరుకు రూ .90.77 కాగా, డీజిల్ ధర రూ .83.75 కాగా, చెన్నైలో పెట్రోల్ ధర రూ .92.58, డీజిల్ ధర లీటరుకు రూ .85.88. హైదరాబాద్ పెట్రోలు ధర రూ. 94.16, డీజిల్‌ రూ. 88.20

also read ఎన్నికల సీజన్, విహారయాత్రలకు కుబేరుల ప్లాన్.. ఛార్టెర్డ్ ఫ్లైట్స్‌కి గిరాకీ ...

నగరం డీజిల్ పెట్రోల్
ఢీల్లీ 80.87 90.56
ముంబై 87.96 96.98
కోల్‌కతా 83.75 90.77
చెన్నై 85.88 92.58

ప్రతిరోజూ ఉదయం ఆరు గంటలకు పెట్రోల్, డీజిల్ ధరలను సవారిస్తుంటారు. అలాగే కొత్త ధరలు ఉదయం 6 గంటల నుండి వర్తిస్తాయి. పెట్రోల్, డీజిల్ ధరలకు ఎక్సైజ్ సుంకం, డీలర్ కమీషన్, ఇతర జోడించిన తరువాత దాని ధర ఇడియాలో దాదాపు రెట్టింపు అవుతుంది.ఈ ప్రమాణాల ఆధారంగా చమురు కంపెనీలు ప్రతిరోజూ పెట్రోల్ ఇంకా డీజిల్ ధరలను నిర్ణయిస్తాయి.

మీ నగరంలో ఇంధన ధరలు తెలుసుకోవాలనుకుంటే
పెట్రోల్, డీజిల్ ధరలను ఎస్ఎంఎస్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఇండియన్ ఆయిల్ వెబ్‌సైట్ ప్రకారం, మీరు ఆర్‌ఎస్‌పి అండ్ మీ సిటీ కోడ్‌ను వ్రాసి 9224992249 నంబర్‌కు పంపాలి. ప్రతి నగరానికి కోడ్ భిన్నంగా ఉంటుంది.