గత రెండు రోజుల పాటు స్థిరంగా ఉన్న ఉన్న ఇంధన ధరలు నేడు మళ్ళీ పెరిగాయి. సోమవారం రాష్ట్ర చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను  సవరించడంతో నేడు డీజిల్ ధర లీటరుపై 31 నుండి 35 పైసలకు పెరగగ పెట్రోల్ ధర కూడా లీటరుకు  23 నుండి 26 పైసలకు పెరిగింది. 

 శుక్రవారం దేశ రాజధాని  ఢీల్లీలో పెట్రోల్ ధర రూ .91.27 కాగా, డీజిల్ ధర లీటరుకు రూ .81.73 గా ఉంది. ముంబైలో పెట్రోల్ ధర రూ .97.61, డీజిల్ ధర లీటరుకు రూ .88.82. 

దేశంలోని ప్రధాన మెట్రో నగరాలలో  పెట్రోల్, డీజిల్ ధర ఎంత ఉందో తెలుసుకోండి,

also read చైనా కంపెనీ విచిత్ర విధానం.. ఆఫీసులో ఒకటి కంటే ఎక్కువసార్లు టాయిలెట్ కి వెళ్తే ఏం చేస్తారో తెలుసా ? ...
 
నగరం    డీజిల్    పెట్రోల్
ఢీల్లీ         82.06    91.53
ముంబై    89.17    97.86
కోల్‌కతా   84.90    91.66
చెన్నై      86.96    93.38
హైదరాబాద్‌    89.47   95.13
 

ప్రతిరోజూ ఆరు గంటలకు ధరల సవరణ 
ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు పెట్రోల్, డీజిల్ ధరలను సమీక్షిస్తారు. కొత్త ధరలు ఉదయం 6 నుండి వర్తిస్తాయి. పెట్రోల్, డీజిల్ ధరలకు ఎక్సైజ్ సుంకం, డీలర్ కమీషన్, జోడించిన తరువాత దాని ధర దాదాపు రెట్టింపు అవుతుంది.ఈ ప్రమాణాల ఆధారంగా చమురు కంపెనీలు ప్రతిరోజూ పెట్రోల్ ధర, డీజిల్ ధరలను నిర్ణయిస్తాయి.