ప్రభుత్వ ఆధీనంలోని చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMCలు) ఇంధన ధరలను జనవరి 5 బుధవారం స్థిరంగా ఉంచాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో, బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ మంగళవారం బ్యారెల్‌కు 80డాలర్లకి పెరిగింది, ఇది నవంబర్ 2021 నుండి అత్యధికం. ఎందుకంటే ఒపెక్(OPEC)దాని మిత్రదేశాలు (OPEC +) ఫిబ్రవరిలో ప్రణాళికాబద్ధమైన ఉత్పత్తికి కట్టుబడి ఉండటానికి అంగీకరించాయి
నేడు పెట్రోల్, డీజిల్ ధరల్లో ప్రభుత్వ చమురు కంపెనీలు నేటికీ ఎలాంటి మార్పు చేయలేదు. గత 30 రోజులకు పైగా ఇంధన ధరలు నేటికీ నిలకడగా ఉన్నాయి. మరోవైపు దేశంలోని పలు రాష్ట్రాల్లో పెట్రోలు ధర ఇప్పటికీ రూ.100 పైనే కొనసాగుతోంది. గత ఏడాది కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన అనంతరం ఇంధన ధరలు దిగోచ్చాయి.
దీపావళికి ముందు మోడీ ప్రభుత్వం పెట్రోల్ పైన రూ.5, డీజిల్ పైన రూ.10 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించి ఆ పండుగ సందర్భంగా శుభవార్త చెప్పింది. ఇక తేలుగు రాష్ట్రాల్లో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు యథాతథంగా కొనసాగుతున్నాయి. ఢిల్లీలోని కేజ్రీ వాల్ ప్రభుత్వం వ్యాట్‌ను ముప్పై శాతం నుండి 19.40 శాతానికి తగ్గించింది దీంతో పెట్రోల్ ధర రూ.8 తగ్గింది.
ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.95.41 కాగా, డీజిల్ ధర లీటరుకు రూ.86.67. ముంబైలో పెట్రోలు ధర రూ.109.98 కాగా, లీటర్ డీజిల్ ధర రూ.94.14గా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.104.67 కాగా, డీజిల్ ధర లీటర్ రూ.89.79. చెన్నైలో కూడా లీటర్ పెట్రోల్ రూ.101.40, డీజిల్ రూ.91.43గా ఉంది. హైదరాబాద్ లో పెట్రోల్ ధర రూ. 108.20, డీజిల్ ధర లీటరుకు రూ.94.62.
also read కెనడాలో ఎయిర్ ఇండియాకి షాక్: ఐఏటీఏకు చెందిన 50 కోట్ల ఆస్తులు సీజ్, కారణం ఏంటో తెలుసా..
ప్రపంచవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రభావం చమురు మార్కెట్ పైన కనిపిస్తోంది. నేడు బ్రెంట్ క్రూడ్ ధర 80.20 డాలర్ల వద్ద, యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ 77.20 డాలర్ల వద్ద ఉంది.
మీ నగరంలో పెట్రోల్, డీజిల్ ధర ఎంతో తెలుసుకోవవడానికి ఎస్‌ఎంఎస్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. IndianOil వెబ్‌సైట్ ప్రకారం మీరు ఆర్‌ఎస్‌పి అండ్ మీ సిటీ కోడ్‌ని టైప్ చేసి 9224992249కి పంపాలి. ప్రతి నగరానికి కోడ్ భిన్నంగా ఉంటుంది.
ఇక్కడ తనిఖీ చేయండి- https://iocl.com/Products/PetrolDieselPrices.aspx
పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు మారుతుంటాయి. కొత్త ధరలు కూడా ఉదయం 6 గంటల నుంచి వర్తిస్తాయి. పెట్రోల్, డీజిల్ ధరలకు ఎక్సైజ్ సుంకం, డీలర్ కమీషన్ ఇతర జోడించిన తర్వాత దాని ధర దాదాపు రెట్టింపు అవుతుంది. ఈ పారామితుల ఆధారంగా చమురు కంపెనీలు ప్రతిరోజూ పెట్రోల్ డీజిల్ ధరలను నిర్ణయిస్తాయి.
