కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పెట్రోల్ ఎక్సైజ్ డ్యూటీలో రూ. 8, డీజిల్ ఎక్సైజ్ డ్యూటీలో రూ. 6 తగ్గింపును ప్రకటించినప్పుడు ఇంధనాల ధరలు చివరిసారిగా మే 21న సవరించబడ్డాయి.

చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMC's) 11 జూలై 2022న సోమవారం  వరుసగా 50వ రోజు ఇంధన ధరలను స్థిరంగా కొనసాగిస్తున్నాయి. ఢిల్లీలో పెట్రోల్  ధర లీటరుకు రూ. 96.72గా కొనసాగుతోంది, అయితే డీజిల్ వినియోగదారులు లీటరుకు రూ.89.62 చెల్లించాల్సి ఉంటుంది. ముంబైలో పెట్రోల్ ధర లీటరుకు రూ.111.35, డీజిల్  ధర  లీటరుకు రూ.97.28గా కొనసాగుతోంది. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.03గా, చెన్నైలో నగరంలో లీటర్ డీజిల్ రూ.92.76గా, పెట్రోల్ ధరపై లీటరుకు రూ.102.63 చెల్లించాల్సి ఉంటుంది.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పెట్రోల్ ఎక్సైజ్ డ్యూటీలో రూ. 8, డీజిల్ ఎక్సైజ్ డ్యూటీలో రూ. 6 తగ్గింపును ప్రకటించినప్పుడు ఇంధనాల ధరలు చివరిసారిగా మే 21న సవరించబడ్డాయి. దీని తరువాత  మే 22న ఢిల్లీ నగరంలో పెట్రోల్ ధర లీటరుకు రూ.8.69, డీజిల్ ధర లీటరుకు రూ.7.05 తగ్గింది.

భారతదేశంలో ఇంధన ధరలు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL), హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) వంటి ప్రభుత్వ రంగ  కంపెనీలు నిర్ణయిస్తాయి. ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు ఇంధన ధరలు సవరిస్తారు. గ్లోబల్ మార్కెట్‌లో అంతర్జాతీయ ముడి చమురు ధరలు, విదేశీ మారకపు ధరలతో సహా పలు అంశాలు ఇంధన ధరలను ప్రభావితం చేస్తాయి. అలాగే స్థానిక కారకాలపై దేశంలో పలు రాష్ట్రాల్లో ఇంధన ధరలు మారుతూ ఉంటుంది.

ఢిల్లీలో  పెట్రోలు ధర లీటరుకు రూ. 96.72, డీజిల్ ధర లీటరుకు రూ. 89.62

ముంబైలో పెట్రోలు ధర లీటరుకు రూ. 111.35, డీజిల్ ధర లీటరుకు రూ. 97.28

కోల్‌కతాలో పెట్రోలు ధర లీటరుకు రూ. 106.03, డీజిల్ ధర లీటరుకు రూ. 92.76

చెన్నైలో పెట్రోలు ధర లీటరుకు రూ. 102.63, డీజిల్ ధర లీటరుకు రూ. 94.24

హైదరాబాద్ లో పెట్రోలు ధర లీటరుకు రూ. 109.66, డీజిల్ ధర లీటరుకు రూ. 97.82