గత ఏడాది మే 21న కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. దింతో లీటరు పెట్రోల్‌పై రూ.8, డీజిల్‌పై రూ.6 చొప్పున తగ్గింది.  కేంద్రం ప్రకటన తర్వాత రాజస్థాన్, మహారాష్ట్ర, ఒడిశా, కేరళ ప్రభుత్వాలు కూడా వ్యాట్‌ను తగ్గించాయి. 

అంతర్జాతీయ సంకేతాలను అనుసరించి భారతీయ ఆయిల్ కంపెనీలు శుక్రవారం ఇంధన ధరలను విడుదల చేశాయి. ప్రతిరోజూ భారతీయ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ తాజా ధరలను విడుదల చేస్తాయి. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఇండియన్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు భారీ లాభాలను నమోదు చేశాయి. భారత చమురు కంపెనీలు గత ఏడాది కాలంగా ఇంధన ధరలను స్థిరంగా ఉంచింది.

 భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL), హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) వంటి ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCలు) గ్లోబల్ బెంచ్‌మార్క్ ధరలను అనుసరించి రోజువారీ ప్రాతిపదికన ధరలను విడుదల చేస్తాయి.

గత ఏడాది మే 21న కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. దింతో లీటరు పెట్రోల్‌పై రూ.8, డీజిల్‌పై రూ.6 చొప్పున తగ్గింది. కేంద్రం ప్రకటన తర్వాత రాజస్థాన్, మహారాష్ట్ర, ఒడిశా, కేరళ ప్రభుత్వాలు కూడా వ్యాట్‌ను తగ్గించాయి.

ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.31, డీజిల్ ధర రూ.94.27. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.03, డీజిల్ ధర రూ.92.76గా ఉంది. మరోవైపు చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.63, డీజిల్ ధర రూ.94.24గా ఉంది.

బెంగళూరు: లీటర్ పెట్రోల్ ధర రూ.101.94, డీజిల్ ధర రూ.87.89.

తిరువనంతపురం: లీటర్ పెట్రోల్ ధర రూ.107.71, డీజిల్ ధర రూ.96.52.

పోర్ట్ బ్లెయిర్: లీటర్ పెట్రోల్ ధర రూ. 84.10 మరియు డీజిల్ ధర రూ.79.74.

భువనేశ్వర్: లీటర్ పెట్రోల్ ధర రూ.103.19, డీజిల్ ధర రూ.94.76.

చండీగఢ్: లీటర్ పెట్రోల్ ధర రూ.96.20, డీజిల్ ధర రూ.84.26.

లక్నో: లీటర్ పెట్రోల్ ధర రూ.96.57, డీజిల్ ధర రూ.89.76.

నోయిడా: లీటర్ పెట్రోల్ ధర రూ.96.57, డీజిల్ ధర రూ.89.96.

జైపూర్: లీటర్ పెట్రోల్ ధర రూ.108.48, డీజిల్ ధర రూ.93.72.

పాట్నా: లీటర్ పెట్రోల్ ధర రూ.107.24, డీజిల్ ధర రూ.94.04

గురుగ్రామ్: లీటర్ పెట్రోల్ ధర రూ. 97.18, డీజిల్ ధర రూ. 90.05 లీటరు.

హైదరాబాద్: లీటర్ పెట్రోల్ ధర రూ.109.66, డీజిల్ ధర రూ.97.82.

పెట్రోల్-డీజిల్ ధరలు విదేశీ మారకపు ధరలతో పాటు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలపై ఆధారపడి ఉంటుంది. పెట్రోల్ డీజిల్ ధరలకు ఎక్సైజ్ సుంకం, డీలర్ కమీషన్ ఇతర జోడించిన తర్వాత వీటి ధర రెట్టింపు అవుతుంది. 

మీ నగరంలో ధరలను తెలుసుకోండి

పెట్రోల్ డీజిల్ రేట్లు ప్రతిరోజూ సవరించబడతాయి అలాగే ఉదయం 6 గంటలకు ప్రకటిస్తారు. మీరు మీ నగరంలో పెట్రోల్-డీజిల్ ధరలు తెలుసుకోవాలంటే, మీరు SMS ద్వారా తెలుసుకోవచ్చు. ఇండియన్ ఆయిల్ కస్టమర్లు మీ సిటీ కోడ్‌తో పాటు RSP అని 9224992249 నంబర్‌కు, BPCL కస్టమర్‌లు RSP అని 9223112222 నంబర్‌కు sms పంపడం ద్వారా సమాచారాన్ని పొందవచ్చు.