Asianet News TeluguAsianet News Telugu

ఇంధన ధరల అప్ డేట్: మీ వాహనంలో పెట్రోల్ నింపే ముందు లీటరు కొత్త ధరలు తెలుసుకొండి..

గత ఏడాది మే 2022లో కేంద్ర ప్రభుత్వం ఇంధన ధరలపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినప్పటి నుండి, కొన్ని రాష్ట్రాలు కూడా పెట్రోల్ డీజిల్ పై వ్యాట్ ధరలను తగ్గించాయి, మరికొన్ని రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్‌పై సెస్ విధించాయి, పంజాబ్ ప్రభుత్వం పెట్రోల్  పై లీటర్‌కు 90 పైసల సెస్ విధించాలని నిర్ణయించింది. 

Petrol and Diesel Rate Today on 8 February: Fuel prices steady Check rates in your  cities
Author
First Published Feb 8, 2023, 9:09 AM IST

ఈ రోజు ఇంధన ధరలు 8 ఫిబ్రవరి 2023 బుధవారంన స్థిరంగా కొనసాగుతున్నాయి, దాదాపు ఎనిమిది నెలల పాటు పెట్రోల్ డీజిల్ ధరలు మారలేధు. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోలు ధర రూ.96.72గా ఉండగా, డీజిల్ ధర లీటరుకు రూ.89.62గా ఉంది. ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ.106.31, డీజిల్ ధర రూ.94.27గా ఉంది. అలాగే పెట్రోల్, డీజిల్ ధరలు రాష్ట్రాలవారీగా మారుతుంటాయి, ఇంకా వాల్యు ఆధారిత పన్ను (VAT), సరకు రవాణా ఛార్జీలు, స్థానిక పన్నులు మొదలైన వివిధ ప్రమాణాలపై ఆధారపడి ఉంటుంది. గత ఏడాది మే 21న దేశ వ్యాప్తంగా ఇంధన ధరల్లో చివరి మార్పు జరిగింది. ఆ సమయంలో పెట్రోలుపై లీటరుకు రూ.8, డీజిల్‌పై రూ.6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తగ్గించారు.

గత ఏడాది మే 2022లో కేంద్ర ప్రభుత్వం ఇంధన ధరలపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినప్పటి నుండి, కొన్ని రాష్ట్రాలు కూడా పెట్రోల్ డీజిల్ పై వ్యాట్ ధరలను తగ్గించాయి, మరికొన్ని రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్‌పై సెస్ విధించాయి, పంజాబ్ ప్రభుత్వం పెట్రోల్  పై లీటర్‌కు 90 పైసల సెస్ విధించాలని నిర్ణయించింది. గత  వారం ఇక్కడ జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో  కేరళ ఆర్థిక మంత్రి కెఎన్ బాలగోపాల్ కూడా ఎల్‌డిఎఫ్ ప్రభుత్వ రెండవ పూర్తి బడ్జెట్‌లో పెట్రోల్, డీజిల్ ఇంకా మద్యంపై సెస్‌ను ప్రకటించారు.  
 
 బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 0119 GMT నాటికి బ్యారెల్‌కు 11 సెంట్లు లేదా 0.1% పెరిగి $83.80కి చేరుకుంది.

చెన్నై: పెట్రోలు ధర లీటరుకు రూ. 102.63, డీజిల్ ధర రూ. 94.24
కోల్‌కతా: ఈరోజు పెట్రోల్ ధర లీటర్‌కు రూ. 106.03, డీజిల్ ధర లీటర్‌కు రూ. 92.76,
బెంగళూరు: పెట్రోలు ధర లీటర్‌కు రూ. 101.94, డీజిల్ ధర రూ.89 లీటరుకు
లక్నో: పెట్రోలు ధర లీటరుకు రూ. 96.57, డీజిల్ ధర రూ. 89.76
నోయిడా: పెట్రోల్ ధర రూ. 96.79, డీజిల్ ధర లీటరుకు రూ. 89.96 
గురుగ్రామ్: పెట్రోల్ ధర రూ. 97.18, డీజిల్ ధర రూ. లీటరుకు 90.05
చండీగఢ్: పెట్రోలు ధర లీటరుకు రూ. 96.20, డీజిల్ ధర లీటరుకు రూ. 84.26
ముంబై: పెట్రోలు ధర లీటరుకు రూ. 106.31, డీజిల్ ధర రూ. 94.27
ఢిల్లీ: పెట్రోలు ధర లీటరుకు రూ. 96.72, డీజిల్ ధర రూ. 89.62
హైదరాబాద్ లీటరు పెట్రోల్ ధర రూ.109.66, డీజిల్ ధర రూ.97.82

భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ( BPCL ), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) అండ్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) సహా ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCలు) అంతర్జాతీయ బెంచ్‌మార్క్ ధరలు ఇంకా ఫారెక్స్ రేట్లకు అనుగుణంగా ప్రతిరోజు ధరలను సవరిస్తాయి. పెట్రోల్, డీజిల్ ధరలలో ఏవైనా మార్పులు  ఉంటే ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుండి అమలు చేయబడతాయి.  

Follow Us:
Download App:
  • android
  • ios