Asianet News TeluguAsianet News Telugu

నేడు పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే.. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వరకు లీటరు ధర ఎంతో తెలుసుకొండి..

కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినప్పటి నుండి కొన్ని రాష్ట్రాలు ఇంధన ధరలపై వ్యాట్ కూడా తగ్గించాయి. మరోవైపు మహారాష్ట్ర ప్రభుత్వం జూలైలో పెట్రోల్‌పై వాల్యూ యాడెడ్ ట్యాక్స్ (వ్యాట్)ని లీటరుకు రూ.5, డీజిల్‌పై రూ.3 తగ్గించింది.
 

Petrol and Diesel Rate Today on 8 December: Fuel prices unchanged Check rates in in your cities
Author
First Published Dec 8, 2022, 10:44 AM IST

 నేడు 8 డిసెంబర్ 2022న ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి. దాదాపు ఆరు నెలలుగా  పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి  మార్పు లేదు. ఈ ఏడాది అంటే మే 21న దేశ వ్యాప్తంగా ఇంధన ధరల్లో చివరిసారి మార్పు జరిగింది, ఆ సమయంలో  కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పెట్రోల్‌పై లీటరుకు రూ.8, డీజిల్‌పై రూ.6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించారు. ప్రస్తుతం ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.31 కాగా, డీజిల్ ధర రూ.94.27గా ఉంది. ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర లీటరుకు రూ.89.62గా ఉన్నాయి.

కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినప్పటి నుండి కొన్ని రాష్ట్రాలు ఇంధన ధరలపై వ్యాట్ కూడా తగ్గించాయి. మరోవైపు మహారాష్ట్ర ప్రభుత్వం జూలైలో పెట్రోల్‌పై వాల్యూ యాడెడ్ ట్యాక్స్ (వ్యాట్)ని లీటరుకు రూ.5, డీజిల్‌పై రూ.3 తగ్గించింది.

పెట్రోల్, డీజిల్ ధరలలో ఏవైనా మార్పులు ఉంటే ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుండి అమలు చేయబడతాయి. అంతేకాదు పెట్రోల్ డీజిల్ ధరలు రాష్ట్రాలవారీగా మారుతుంటాయి. వాల్యు ఆధారిత పన్ను (VAT), సరుకు రవాణా ఛార్జీలు, స్థానిక పన్నులు మొదలైన వివిధ ప్రమాణాలపై ఆధారపడి ఉంటుంది.

భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ( BPCL ), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) సహా ప్రభుత్వ రంగ OMCలు IOCL), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) అంతర్జాతీయ బెంచ్‌మార్క్ ధరలు, ఫారెక్స్ రేట్లకు అనుగుణంగా ప్రతిరోజూ ధరలను సవరిస్తాయి.


ఢిల్లీ : లీటర్ పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62.

ముంబై: లీటరు పెట్రోలు ధర రూ.106.31, డీజిల్ ధర రూ.94.27.

కోల్‌కతా: లీటర్ పెట్రోల్ ధర రూ.106.03, డీజిల్ ధర రూ.92.76.

చెన్నై : లీటర్ పెట్రోల్ ధర రూ.102.63, డీజిల్ ధర రూ.94.24.

హైదరాబాద్ : లీటర్ పెట్రోల్ ధర రూ.109.66, డీజిల్ ధర రూ.97.82.

బెంగళూరు : లీటర్ పెట్రోల్ ధర రూ.101.94, డీజిల్ ధర రూ.87.89.

తిరువనంతపురం: లీటర్ పెట్రోల్ ధర రూ.107.71, డీజిల్ ధర రూ.96.52.

పోర్ట్ బ్లెయిర్: లీటర్ పెట్రోల్ ధర రూ.84.10, డీజిల్ ధర రూ.79.74.

భువనేశ్వర్: లీటర్ పెట్రోల్ ధర రూ.103.19, డీజిల్ ధర రూ.94.76.

చండీగఢ్: లీటర్ పెట్రోల్ ధర రూ.96.20, డీజిల్ ధర రూ.84.26.

లక్నో: లీటర్ పెట్రోల్ ధర రూ.96.57, డీజిల్ ధర రూ.89.76.

నోయిడా: లీటర్ పెట్రోల్ ధర రూ.96.57, డీజిల్ ధర రూ.89.96.

జైపూర్: లీటర్ పెట్రోల్ ధర రూ.108.48, డీజిల్ ధర రూ.93.72.

పాట్నా: లీటర్ పెట్రోల్ ధర రూ.107.24, డీజిల్ ధర రూ.94.04

గురుగ్రామ్: పెట్రోల్ ధర  రూ. 97.18, డీజిల్ ధర రూ. 90.05 లీటరు.  

Follow Us:
Download App:
  • android
  • ios