Asianet News TeluguAsianet News Telugu

స్థిరంగా ఇంధన ధరలు.. హైదరాబాద్ లో నేటి పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు ఇవే..

ఈ ఏడాది మే 21న దేశ వ్యాప్తంగా ఇంధన ధరల్లో చివరిసారి మార్పు జరిగింది, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పెట్రోల్‌పై లీటరుకు రూ.8, డీజిల్‌పై రూ.6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన సంగతి మీకు తెలిసిందే. 

Petrol and Diesel Rate Today on 28 December: Fuel rates unchanged Check prices inyour cities
Author
First Published Dec 28, 2022, 9:45 AM IST

ఇండియాలో  నేడు  అంటే 28 డిసెంబర్ 2022న ఇంధన ధరలల్లో ఎలాంటి మార్పు లేదు. దీంతో దాదాపు ఏడు నెలలుగా  పెట్రోల్ డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. ఈ ఏడాది మే 21న దేశ వ్యాప్తంగా ఇంధన ధరల్లో చివరిసారి మార్పు జరిగింది, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పెట్రోల్‌పై లీటరుకు రూ.8, డీజిల్‌పై రూ.6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన సంగతి మీకు తెలిసిందే.  ప్రస్తుతం ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.31 కాగా, డీజిల్ ధర రూ.94.27గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర లీటరుకు రూ.89.62గా  ఉంది.

నేటి పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి: 
చెన్నై: పెట్రోలు ధర లీటరుకు రూ. 102.63, డీజిల్ ధర రూ. 94.24
కోల్‌కతా: నేడు పెట్రోలు ధర లీటరుకు రూ. 106.03, డీజిల్ ధర లీటర్‌కు రూ. 92.76,
బెంగళూరు: పెట్రోలు ధర లీటర్‌కు రూ. 101.94, డీజిల్ ధర రూ.87.89 లీటరుకు
లక్నో: పెట్రోలు ధర లీటరుకు రూ. 96.57, డీజిల్ ధర రూ. 89.76
నోయిడా: పెట్రోల్ ధర రూ. 96.79, డీజిల్ ధర లీటరుకు రూ. 89.96 
గురుగ్రామ్: పెట్రోల్ ధర రూ. 97.18, డీజిల్ ధర లీటరుకు రూ. 90.05
చండీగఢ్: పెట్రోలు ధర రూ. 96.20, డీజిల్ ధర రూ. 84.26

హైదరాబాద్: లీటర్ పెట్రోల్ ధర రూ.109.66, డీజిల్ ధర రూ.97.82.

పెట్రోల్, డీజిల్ ధరలలో ఏవైనా మార్పులు ఉంటే ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుండి అమలు చేయబడతాయి. పెట్రోల్, డీజిల్ ధరలు రాష్ట్రాలవారీగా మారుతుంటాయి, విలువ ఆధారిత పన్ను (VAT), సరుకు రవాణా ఛార్జీలు, స్థానిక పన్నులు మొదలైన వివిధ ప్రమాణాలపై ఆధారపడి ఉంటాయి. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL),  ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) సహా ప్రభుత్వ రంగ OMCలు ( IOCL)  ఇంకా హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) అంతర్జాతీయ బెంచ్‌మార్క్ ధరలు, ఫారెక్స్ రేట్లకు అనుగుణంగా ప్రతిరోజూ ధరలను సవరిస్తాయి.

కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినప్పటి నుండి  కొన్ని రాష్ట్రాలు ఇంధన ధరలపై వ్యాట్ కూడా తగ్గించాయి. ఆగస్ట్ 24న VATని పెంచినప్పుడు ఇంధన ధరలను అప్‌డేట్ చేసిన చివరి రాష్ట్రం మేఘాలయ, ఈ కారణంగా షిల్లాంగ్‌లో ఇప్పుడు పెట్రోల్ ధర రూ. 96.83, డీజిల్ ధర ఇప్పుడు లీటరుకు రూ. 84.72. మహారాష్ట్ర ప్రభుత్వం జూలైలో పెట్రోల్‌పై వాల్యూ యాడెడ్ ట్యాక్స్ (వ్యాట్)ని లీటరుకు రూ.5, డీజిల్‌పై రూ.3 తగ్గించింది.

Follow Us:
Download App:
  • android
  • ios