Asianet News TeluguAsianet News Telugu

నేడు పెట్రోల్ డీజిల్ కొత్త ధరలు విడుదల.. హైదరాబాద్ లో లీటరు ధర ఎంతంటే..?

నేడు అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధర తగ్గుముఖం పట్టింది. WTI క్రూడ్ ధర బ్యారెల్‌కు $78డాలర్లకి, బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు $85డాలర్లకి పడిపోయింది.
 

Petrol and Diesel Rate Today on 22 December: Fuel rates steady Check prices in your cities
Author
First Published Dec 22, 2022, 9:00 AM IST

 అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధర తగ్గుతున్న నేపథ్యంలో ఇండియన్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నేడు పెట్రోల్, డీజిల్ తాజా ధరలను విడుదల చేశాయి. అయితే, భారతీయ ఆయిల్ కంపెనీలు గురువారం అంటే డిసెంబర్ 22న పెట్రోల్, డీజిల్ ధరలను స్థిరంగా కొనసాగించాయి.

భారతదేశంలో పెట్రోలు, డీజిల్ ధరలలో ఎటువంటి మార్పు లేకుండా నేటికీ వరుసగా 216వ రోజు. నేడు అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధర తగ్గుముఖం పట్టింది. WTI క్రూడ్ ధర బ్యారెల్‌కు $78డాలర్లకి, బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు $85డాలర్లకి పడిపోయింది.

అంతకుముందు మే 21న కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన సంగతి మీకు తెలిసిందే. అప్పుడు లీటర్ పెట్రోల్‌పై రూ.8, డీజిల్‌పై రూ.6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించారు. అప్పటి నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు భారిగా దిగోచ్చాయి.  కేంద్రం ప్రకటన తర్వాత రాజస్థాన్, మహారాష్ట్ర, ఒడిశా, కేరళ ప్రభుత్వాలు కూడా పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ని తగ్గించాయి.

ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.106.31, డీజిల్ రూ.94.27. కోల్‌కతాలో పెట్రోలు ధర రూ.106.03, డీజిల్ ధర లీటరుకు రూ.92.76గా ఉంది. మరోవైపు చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.63, డీజిల్ ధర రూ.94.24గా ఉంది.

రాజస్థాన్‌లోని గంగానగర్‌, హనుమాన్‌గఢ్‌ జిల్లాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు అత్యధికంగా ఉన్నాయి. గంగానగర్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.113.48, డీజిల్‌ ధర రూ.98.24. హనుమాన్‌గఢ్‌ జిల్లాలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.112.54కు, డీజిల్‌ ధర రూ.97.39గా ఉంది.

ఇండియాలో పెట్రోల్, డీజిల్ ధర పోర్ట్ బ్లెయిర్‌లో అతితక్కువకు లభిస్తోంది, ఇక్కడ పెట్రోల్ ధర లీటరుకు రూ. 84.10, డీజిల్ ధర లీటరుకు రూ.79.74గా ఉంది.

నేడు పెట్రోల్ డీజిల్ ధర ఎంతంటే ?

హైదరాబాద్: లీటర్ పెట్రోల్ ధర రూ.109.66, డీజిల్ ధర రూ.97.82.

బెంగళూరు: లీటర్ పెట్రోల్ ధర రూ.101.94, డీజిల్ ధర రూ.87.89.

తిరువనంతపురం: లీటర్ పెట్రోల్ ధర రూ.107.71, డీజిల్ ధర రూ.96.52.

పోర్ట్ బ్లెయిర్: లీటర్ పెట్రోల్ ధర రూ. 84.10, డీజిల్ ధర రూ.79.74.

భువనేశ్వర్: లీటర్ పెట్రోల్ ధర రూ.103.19, డీజిల్ ధర రూ.94.76.

చండీగఢ్: లీటర్ పెట్రోల్ ధర రూ.96.20, డీజిల్ ధర రూ.84.26.

లక్నో: లీటర్ పెట్రోల్ ధర రూ.96.57, డీజిల్ ధర రూ.89.76.

నోయిడా: లీటర్ పెట్రోల్ ధర రూ.96.57, డీజిల్ ధర రూ.89.96.

జైపూర్: లీటర్ పెట్రోల్ ధర రూ.108.48, డీజిల్ ధర రూ.93.72.

పాట్నా: లీటర్ పెట్రోల్ ధర రూ.107.24, డీజిల్ ధర రూ.94.04

ఎక్సైజ్‌ డ్యూటీ, డీలర్‌ కమీషన్‌, ఇతర చార్జీలు కలిపితే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు అసలు ధర కంటే దాదాపు రెట్టింపు అవుతాయి. విదేశీ మారకపు ధరలతో పాటు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల ఆధారంగా పెట్రోల్, డీజిల్ ధరలను ప్రతిరోజూ సమీక్షిస్తుంటారు.

ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు పెట్రోలు, డీజిల్ ధరల్లో మార్పు ఉంటుంది. కొత్త ధరలు ఉదయం 6 గంటల నుంచి వర్తిస్తాయి. పెట్రోల్, డీజిల్ ధరలకు ఎక్సైజ్ సుంకం, డీలర్ కమీషన్, వ్యాట్  ఇతర జోడించిన తర్వాత, దాని ధర అసలు ధర కంటే దాదాపు రెట్టింపు అవుతుంది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఇంత ఎక్కువగా కనిపించడానికి ఇదే కారణం.

Follow Us:
Download App:
  • android
  • ios