పెట్రోల్ భగభగలు.. పేటీఎం భారీ డిస్కౌంట్ ఆఫర్

https://static.asianetnews.com/images/authors/d7f5adfb-1610-5d53-be8e-55db5850d97e.jpg
First Published 14, Sep 2018, 1:59 PM IST
Paytm Offers Up To 7,500 Rupees Cashback On Petrol, Diesel Purchase. All Details Here
Highlights

పేటీఎం ద్వారా  జరిపే పెట్రోల్‌, డీజిల్‌ కొనుగోళ్లపై  డిస్కౌంట్‌ స్కీంను, క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌ను ప్రకటించింది.

ఒకవైపు దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.  రోజురోజుకీ పెరిగిపోతున్న ధరలను చూసి వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. కాగా.. వారికి ఉపశమనం కలిగించేలా పేటీఎం తాజా ప్రకటన చేసింది. పేటీఎం ద్వారా  జరిపే పెట్రోల్‌, డీజిల్‌ కొనుగోళ్లపై  డిస్కౌంట్‌ స్కీంను, క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌ను ప్రకటించింది.
 
పెట్రోల్‌, డీజిల్‌ కొనుగోలు చెల్లింపులపై రూ. 7500 దాకా డిస్కౌంట్లను, క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్లను అందించనున్నట్టు వెల్లడించింది.  పేటీఎం.కాం అందించిన  సమాచారం ప్రకారం ఇందుకు కనీస లావాదేవీ రూ.50.   ఇలా మొత్తం 50 ట్రాన్సాక్షన్స్‌ చేయాల్సి ఉంటుంది. ఈ ఆఫర్‌ ఆగష్టు 1, 2019 వరకు చెల్లుతుంది.

పెట్రోల్‌ బంకు దగ్గర  మొదటి కనీస లావాదేవీ ముగిసిన  అనంతరం, వినియోగదారులకు రూ. 7500 దాకా  క్యాష్ బ్యాక్ ఆఫర్' లో పాల్గొనమంటూ ఒక ఎస్‌ఎంఎస్‌ వస్తుంది.  ఇందులో ఒక ప్రోమో కోడ్‌ను కూడా జత చేస్తుంది.  దీని ద్వారా  11, 21, 31, 41లావాదేవీల అనంతరం క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ ఇస్తుంది. అంటే ప్రతీ పదవ లావాదేవీ అనంతరం రూ.1350 క్యాష్‌ బ్యాక్‌ వస్తుంది.  

ఇలా మొత్తం 50 ట్రాన్సాక్షన్స్‌ ద్వారా రూ.7500 క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌ను వినియోగదారులు పొందవచ్చు. లావాదేవీ ముగిసిన 48 పనిగంటల లోపు ఎస్‌ఎంఎస్‌ వస్తుంది. ఈ ఎస్‌ఎంఎస్‌ ద్వారా వచ్చే ఈ  ప్రోమో కోడ్‌తో మాత్రమే వీటిని రిడీమ్‌ చేసుకోవచ్చు.  అలాగే ఒక వారంలో ఎన్ని  ట్రాన్సాక్షన్‌ జరిగినా  ముందు జరిగిన లావాదేవీకి మాత్రమే  ఈ ఆఫర్‌ వర్తిస్తుంది.

loader