ప్రముఖ ఈ-చెల్లింపుల సంస్థ పేటీఎం వ్యవస్ధాపకుడు విజయ్ శేఖర్ శర్మను బ్లాక్‌మెయిలింగ్‌కు గురయ్యారు.  ఆయన వద్ద నుంచి రూ. 20 కోట్లు డిమాండ్ చేసిన ముగ్గురు పేటీఎం ఉద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఓ మహిళ సహా కొందరు ఉద్యోగులు తనను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారంటూ శేఖర్ శర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన వ్యక్తిగత వివరాలతో పాటు.. కంపెనీకి సంబంధించిన అత్యంత విలువైన సమాచారాన్ని దొంగిలించారని.. రూ. 20 కోట్లు ఇవ్వకుంటే వాటిని బయటపెడతామంటున్నారని శర్మ ఫిర్యాదులో పేర్కొన్నారు.

దీనిపై రంగంలోకి దిగిన పోలీసులు సదరు మహిళ సహా.. ముగ్గురు ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కుట్ర మొత్తానికి విజయ్.. వ్యక్తిగత కార్యదర్శే సూత్రధారి అని పోలీసులు తెలిపారు. ఈ కేసులో పరారీలో ఉన్న మరో నిందితుడి కోసంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సంఘటన కార్పోరేట్ ప్రపంచంలో కలకలం రేపింది.