కరోనా వైరస్ లాక్ డౌన్ సమయంలో అత్యధిక సంఖ్యలో బిస్కెట్లను విక్రయించడంలో పార్లే-జి ఒక ప్రత్యేకమైన ఘనతను సాధించింది. 1938 నుండి మాతృ సంస్థ, పార్లే ప్రొడక్ట్స్ మార్చి, ఏప్రిల్, మే ఈ మూడు నెలలలో గణనీయమైన అమ్మకాలను నమోదు చేసి దేశంలో పార్లే-జి బిస్కెట్ల అమ్మకాలు  రికార్డు సృష్టించాయి.

మేము మా మొత్తం మార్కెట్ వాటాను దాదాపు 5% పెంచాము అలాగే మా వృద్ధిలో 80-90% పార్లే-జి సేల్స్ నుండి వచ్చాయి అని పార్లే ఉత్పత్తుల కేటగిరీ హెడ్ మయాంక్ షా కోట్ అన్నారు.లాక్ డౌన్ సమయంలో పార్లే-జి బిస్కట్లు చాలా మందికి కంఫర్ట్ ఫుడ్ గా మారింది.

also read వేసవిలో భగ్గుమంటున్న పెట్రోల్, డీజిల్ ధరలు... వరుసగా నాలుగో రోజు కూడా ...

ఇది ఒక సామాన్యుడి బిస్కెట్ అని తెలిపారు. పార్లే-జి, 1938 నుండి మంచి ప్రజాదరణ పొందిన బ్రాండ్, ప్రతిఒక్కరు తినే బిస్కెట్ బ్రాండ్. లాక్ డౌన్ సమయంలో కొందరు తమ ఇళ్లలో బిస్కెట్లను నిల్వచేసుకున్నారు కూడా అని చెప్పడం విశేషం.ఈ అసాధారణమైన అమ్మకాలతో  పార్లే సంస్థ  మార్కెట్ వాటా 4.5 నుండి 5 శాతానికి పెరిగిందన్నారు.

గత 30-40 సంవత్సరాలలో ఈ ఇంతటి వృధ్దిని  ఎప్పుడు చూడలేదన్నారు. భారతదేశంలో కరోనావైరస్ మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో మూడు కోట్ల  పార్లేజీ బిస్కెట్లను విరాళంగా ఇస్తున్నట్లు కంపెనీ ప్రకటించిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్  సమయంలో పార్లే-జి అన్ని బిస్కెట్ కంపెనీలలో అత్యధిక వృద్ధి రేటు కలిగి ఉందని మయాంక్ షా పేర్కొన్నారు.