పాన్ కార్డును ఆధార్ తో లింక్ చేయడానికి గడువును మరో 3 నెలలు పొడిగించారు. ఇప్పుడు పాన్ కార్డ్ , ఆధార్ కార్డ్‌లను 30 జూన్ 2023 వరకు లింక్ చేయవచ్చు.
పాన్ కార్డును ఆధార్ తో లింక్ చేయడానికి గడువు మళ్లీ పొడిగించారు. గతంంలో ఈ పని చేయడానికి, మార్చి 31, 2023ని చివరి తేదీగా నిర్ణయించారు. అయితే ఇప్పుడు దాన్ని మూడు నెలలు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు పాన్ కార్డ్ , ఆధార్ కార్డ్‌లను 30 జూన్ 2023 వరకు లింక్ చేయవచ్చు. పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడానికి చివరి తేదీని పెంచాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకున్న తర్వాత, కొత్త ఫిక్స్‌డ్ డేట్ అంటే 30 జూన్ 2023గా నిర్ధారించారు. ఈ తేదీలో మీరు లింక్ చేయడంలో విఫలమైతే, మీ పాన్ కార్డ్‌తో ఉపయోగంలోకి రాకుండా ఉండిపోతుందని ఆదాయపన్ను శాఖ తెలిపింది.
దీనికి సంబంధించిన సమాచారాన్ని ఆదాయపు పన్ను శాఖ కూడా ట్విట్టర్ ద్వారా పంచుకుంది.ఈ ముఖ్యమైన పని కోసం పన్ను చెల్లింపుదారులకు మరికొంత సమయం ఇవ్వడానికి జూన్ 30 తేదీని పొడిగించినట్లు ట్వీట్‌లో పేర్కొన్నారు. ముందుగా నిర్ణయించిన గడువు ముగియడానికి మూడు రోజుల ముందు పన్ను చెల్లింపుదారులకు ఈ ఉపశమనం అందించనున్నారు. పాన్ కార్డ్ ప్రస్తుతం అత్యంత ముఖ్యమైన డాక్యుమెంటు అని చెప్పవచ్చు.
జూన్ 30 తర్వాత పాన్ కార్డ్ డియాక్టివేట్ అవుతుంది..
మీరు పాన్-ఆధార్ లింక్ చేయకపోతే, మీ పాన్ కార్డ్ డియాక్టివేట్ అవుతుంది.ఇదే జరిగితే, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్ పెట్టుబడులు వంటి వాటిని కార్డు హోల్డర్లు చేయలేరు. ఇది మాత్రమే కాదు బ్యాంక్ ఖాతా తెరవడం నుండి రియల్ ఎస్టేట్ లేదా మరేదైనా డీల్ వరకు, పాన్ కార్డ్ చాలా ముఖ్యమైన డాక్యమెంట్. కాబట్టి గడువు పొడిగించినప్పటికీ, చివరి తేదీ కోసం వేచి ఉండకుండా వీలైనంత త్వరగా ఈ పనిని పూర్తి చేయడం మంచిదని నిపుణులు పేర్కొంటున్నారు.
పాన్ కార్డ్ డియాక్టివేట్ అయినప్పుడు, మీరు దానిని ఏదైనా ఆర్థిక పని కోసం డాక్యుమెంట్‌గా ఉపయోగిస్తే, మీకు రూ. 10,000 వరకు జరిమానా విధించవచ్చు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 272బి కింద, ఇంత జరిమానా విధించే నిబంధన ఉంది. జూన్ 30, 2023 వరకు, రూ. 1000 జరిమానా చెల్లించడం ద్వారా మీరు మీ పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయవచ్చని గమనించండి. వాస్తవానికి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) జూన్ 30, 2022 నుండి ఆధార్‌ను పాన్‌తో లింక్ చేసినందుకు రూ. 1000 ఆలస్యమైన జరిమానాను నిర్ణయించింది. లేట్ ఫీజు చెల్లించకుండా మీరు పాన్ ఆధార్‌తో లింక్ చేయలేరు.
