Asianet News TeluguAsianet News Telugu

సైరస్ మిస్త్రీ ప్రయాణిస్తున్న కారు ఎంత స్పీడ్ తో వెళ్తుందో తెలుసా..?

సైరస్ మిస్త్రీ  ప్రయాణిస్తున్న ఎస్‌యూ‌వి కార్ 130-140 kmph స్పీడ్ తో ప్రయాణిస్తున్నట్లు సూచిస్తోందని ఒక సీనియర్ అధికారి అన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఖచ్చితమైన వేగాన్ని అంచనా వేయడానికి తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్‌ను సంప్రదించనున్నట్లు తెలిపారు.

Palghar Initial probe says car travelling by Cyrus Mistry was at 130 to 140 kmph
Author
First Published Sep 6, 2022, 12:42 PM IST

ముంబై: పాల్ఘర్ జిల్లాలోని చరోటీ వద్ద ముంబై-అహ్మదాబాద్ హైవేపై టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ అతని స్నేహితుడు జహంగీర్ పండోల్‌ మృతి చెందిన  ప్రమాదంపై ప్రాథమిక నివేదికలో ప్రమాదానికి గల కారణం అతివేగం,  నిర్లక్షయం అని పేర్కొంది. కొంకణ్ రేంజ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సంజయ్ మోహితే సోమవారం స్టేట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రజనీష్ సేథ్‌కు ఈ నివేదికను సమర్పించారు. ప్రమాదంపై ఉన్నత స్థాయి విచారణకు ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆదివారం ఆదేశించారు.

సైరస్ మిస్త్రీ  ప్రయాణిస్తున్న ఎస్‌యూ‌వి కార్ 130-140 kmph స్పీడ్ తో ప్రయాణిస్తున్నట్లు సూచిస్తోందని ఒక సీనియర్ అధికారి అన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఖచ్చితమైన వేగాన్ని అంచనా వేయడానికి తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్‌ను సంప్రదించనున్నట్లు తెలిపారు. ఈ ప్రమాదం ప్రభావం చాలా పెద్దది, కార్ రేడియేటర్ పూర్తిగా పగిలిపోవడమే కాకుండా, కనీసం రెండు నుండి మూడు అడుగుల లోపలికి నెట్టబడింది" అని తెలిపారు. పాల్ఘర్ జిల్లాలోని హైవేపై టాప్ స్పీడ్ లిమిట్ గంటకు 80 కి.మీ (జాతీయ రహదారులపై 100 కి.మీ.) అని సీనియర్ ఒక పోలీసు అధికారి తెలపగా, ఒకవేళ కారు గంటకు 90 కి.మీ వేగంతో ఉన్నా ఓవర్ స్పీడ్ కేస్ కి కారణమవుతుందని ఆయన అన్నారు.

ప్రమాదం జరిగిన సమయంలో ఖచ్చితమైన స్పీడ్ పై నివేదికను ఖచ్చితం చేసే ముందు ప్రమాద స్థలాన్ని, ఎస్‌యూ‌వి కార్ శిధిలాలను పరిశీలించవలసిందిగా మెర్సిడెస్ బెంజ్‌ అధికారులను కోరాల్సి ఉంది,
అయితే సూర్య నదీ వంతెనపై రోడ్డు మూడు లేన్ల నుంచి రెండుకి మారినపుడు కార్ నడుపుతున్న అనహిత పండోలే నిర్లక్షయం/తప్పు చేసి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. అయితే డ్రైవర్ కార్ పై కంట్రోల్ కోల్పోయి వంతెన రెయిలింగ్‌ను ఢీకొట్టినట్లు పోలీసు అధికారి తెలిపారు. కార్ వెనుక సీటులో ఉన్న సైరస్ మిస్త్రీ (54), జహంగీర్ (49) సీటు బెల్టు ధరించలేదని ప్రాథమిక విచారణలో తేలింది. అయితే ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకున్న  సీట్ బెల్ట్  పేట్టుకోకపోవడంతో వారి తల ముందు సీట్లకి బలంగా  తాకాయి.

మరోవైయిపు ముందు సీట్లో కూర్చున్నా డాక్టర్ అనాహిత, ఆమె భర్త డారియస్ సీటు బెల్ట్ ధరించడంతో వారు ప్రాణాలతో బయటపడి ముంబైలోని హెచ్‌ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. డాక్టర్ అనాహిత మద్యం సేవించి కార్ నడిపిందా లేదా అనేది  నిర్ధారించేందుకు ఆమె బ్లడ్ సాంపుల్స్  సేకరించినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయం మధ్యాహ్నం 2.45గా నమోదైంది. మధ్యాహ్నం 2.55 గంటలకు ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ నంబర్ 112కు ప్రమాదం గురించి సమాచారం అందించారు. బీట్ మార్షల్ మధ్యాహ్నం 3.10 గంటలకు ప్రమాద స్థలానికి చేరుకుని బాధితులను కాసా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే హాస్పిటల్ చేరే లోగా సైరస్ మిస్త్రీ, జహంగీర్‌ చనిపోయారు.

మహారాష్ట్ర-గుజరాత్ సరిహద్దులోని దప్చారి టోల్ నాకా వద్దకి మధ్యాహ్నం 2.10 గంటలకు రాష్ట్రంలోకి ప్రవేశించిన కారును సీసీటీవీ క్యాప్చర్ చేసింది. మధ్యాహ్నం 2.12 గంటలకు టోల్ గేట్ నుండి బయలుదేరి చరోతి వైపు హైవేపైకి వచ్చింది. చరోతికి దూరం దాదాపు 25 కి.మీ. చరోతి టోల్ నాకాకు 500 మీటర్ల దూరంలో ఉన్న పాత సూర్య నది వంతెన రెయిలింగ్‌ను సైరస్ మిస్ట్రీ ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది. సంఘటనా స్థలాన్ని సందర్శించిన రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ అధికారులు మాట్లాడుతూ 2018లో తయారు చేసిన ఈ కార్ ప్రమాదానికి ముందు కండిషన్లోనే ఉన్నట్లు తెలుస్తోంది అని  అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios