మార్చి 16న భారత స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 90.13 పాయింట్లు  క్షీణించి 57,465.77 వద్ద, నిఫ్టీ 23.20 పాయింట్లు  క్షీణించి 16,949 వద్ద ట్రేడవుతున్నాయి. 

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. బిఎస్‌ఇ సెన్సెక్స్ 120.07 పాయింట్లు క్షీణించి 57,435.83 వద్ద ప్రారంభం అవగా, ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 34 పాయింట్లు పడిపోయి 16,938.15 వద్ద ప్రారంభమైంది. ఇక బ్యాంక్ నిఫ్టీ సూచీ సైతం 102.95 పాయింట్లు పడిపోయి 38,948 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 50లో బిపిసిఎల్, టైటాన్, పవర్ గ్రిడ్, నెస్లే ఇండియా, దివీస్ ల్యాబ్ టాప్ గెయినర్లుగా ఉన్నాయి. హిందాల్కో, టాటా స్టీల్, జెఎస్‌డబ్ల్యు స్టీల్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఒఎన్‌జిసి టాప్ లూజర్లుగా ఉన్నాయి.

ఈరోజు మార్కెట్‌లో ఇంట్రాడేలో మంచి స్టాక్‌ల కోసం వెతుకుతున్నట్లయితే, మీరు కొన్ని స్టాక్స్ పై ఫోకస్ పెట్టొచ్చు. వాటిలో Federal Bank, SJVN, RIL, JSW Energy, GAIL (India), IOC, Ramkrishna Forgings & Titagarh Wagons, Sarda Energy & Minerals, Sunflag Iron and Steel Company, Mindspace Business Parks REIT, Orient Paper and Industries, NIBE, Sadbhav Engineering, TIL, Sona BLW Precision Forgings, KPI Green Energy, Vedanta వంటి స్టాక్స్ ఉన్నాయి. ఈ స్టాక్స్ చాలా వరకూ కొన్ని కంపెనీలు వ్యాపారాన్ని పెంచేందుకు చర్యలు తీసుకోగా, మరికొన్ని పెద్ద ఎత్తున ఆర్డర్లు పొందాయి. కొన్నింటిలో పెట్టుబడులు రాగా, కొన్నింటిలో వాటా విక్రయం కనిపించింది.

Federal Bank: ఫెడరల్ బ్యాంక్ డైరెక్టర్ల బోర్డు మార్చి 18న సమావేశమై డిబెంచర్ల వంటి అసురక్షిత బాసెల్ III టైర్-II సబార్డినేటెడ్ బాండ్లను జారీ చేయడం ద్వారా నిధులను సమీకరించే ప్రతిపాదనను పరిశీలించనుంది. ప్రైవేట్ ప్లేస్‌మెంట్ ఆధారంగా ఈ మొత్తం రూ.1,000 కోట్లు అవుతుంది.

SJVN: ప్రభుత్వ రంగ సంస్థ SJVN పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల అభివృద్ధికి ఇండియా ఆయిల్ కార్పొరేషన్‌తో ప్రాథమిక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం, రెండు కంపెనీలు జాయింట్ వెంచర్‌గా ఏర్పడతాయి.

రిలయన్స్: రిలయన్స్ జియో తన 5G నెట్‌వర్క్‌ను 10 రాష్ట్రాలు. కేంద్రపాలిత ప్రాంతాలలో మరో 34 నగరాల్లో ప్రారంభించింది. దీంతో జియో 5జీ నెట్‌వర్క్ 365 నగరాలకు చేరుకుంది. డిసెంబర్ 2023 చివరి నాటికి, దేశంలోని ప్రతి నగరంలో, ప్రతి తాలూకాలో Jio తన 5G సేవలను ప్రారంభిస్తుంది.

JSW ఎనర్జీ: పవర్ ప్రొడ్యూసర్ JSW ఎనర్జీ నాన్-కన్వర్టబుల్ డిబెంచర్ల ద్వారా రూ. 250 కోట్లను సమీకరించనుంది, దాని ఫైనాన్స్ కమిటీ ఒక్కొక్కటి రూ. 1 లక్ష చొప్పున 25,000 నాన్-కన్వర్టబుల్ డిబెంచర్ల కేటాయింపును ఆమోదించింది. ప్రైవేట్ ప్లేస్‌మెంట్ ప్రాతిపదికన ఎన్‌సీడీల ద్వారా రూ.2,500 కోట్ల వరకు నిధులు సమీకరించేందుకు గతేడాది అక్టోబర్‌లో బోర్డు ఆమోదం తెలిపింది. మెచ్యూరిటీ తేదీ మార్చి 13, 2026గా నిర్ణయించారు. 

గెయిల్ : దివాలా తీసిన ప్రైవేట్ రంగ సంస్థ జేబీఎఫ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్‌ను రూ.2,079 కోట్లకు కొనుగోలు చేసేందుకు దేశంలోని అతిపెద్ద గ్యాస్ కంపెనీ గెయిల్ ఆమోదం పొందింది. ఈ కొనుగోలు పెట్రోకెమికల్ వ్యాపారంలో తన ఉనికిని పెంచుకోవడానికి గెయిల్‌కు సహాయపడుతుంది. 

IOC: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) తక్కువ కార్బన్, క్లీన్ అండ్గ్ గ్రీన్ ఎనర్జీ వ్యాపారం కింద కొత్త సబ్సిడరీ సంస్థను ప్రారంభించింది. దేశంలోని అతిపెద్ద చమురు శుద్ధి, ఇంధన మార్కెటింగ్ కంపెనీ 2046 నాటికి తన కార్యకలాపాల నుండి నికర సున్నా ఉద్గారాలను సాధించాలని యోచిస్తోంది. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు కొత్త అనుబంధ సంస్థ ఉపయోగపడుతుంది.