వన్-మోటో ఇండియా సేల్ పాయింట్ వద్ద  ఇన్సూరెన్స్ తో సహా  కస్టమర్ అవసరాల కోసం రాయల్ సుందరం జనరల్ ఇన్సూరెన్స్‌తో భాగస్వామ్యాన్ని ప్రకటించింది. 

భారతదేశంలోని ప్రీమియం ఎలక్ట్రిక్ వాహనాల మొట్టమొదటి బ్రిటిష్ బ్రాండ్ వన్-మోటో (One-Moto)ఇండియా డీలర్‌షిప్‌లలో ఎలక్ట్రిక్ వాహనాల కోసం కస్టమర్‌లకు ఇన్సూరెన్స్ పాలసీలను జారీ చేయడం కోసం రాయల్ సుందరం జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్ (royal sundaram)తో భాగస్వామ్యాన్ని ప్రకటించింది.

వన్ మోటో ఇండియా ప్రాడెక్ట్స్, సర్వీసెస్ పరంగా వేగవంతమైన వృద్ధిని ప్రదర్శిస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో కస్టమర్‌లకు ఎక్స్ పిరియన్స్ ప్రోవైడర్ గా మారేందుకు బ్రాండ్ నిశ్చయించుకుంది. ఎలక్ట్రిక్ వాహనల స్టార్టప్ తాజాగా భారతదేశం అంతటా సులభమైన రోడ్‌సైడ్ అసిస్టెన్స్ సేవలను అందించడానికి గ్లోబల్ అష్యూర్‌తో అనుబంధాన్ని ప్రకటించింది.

రాయల్ సుందరం జనరల్ ఇన్సూరెన్స్‌తో బ్రాండ్ టై-అప్ వినియోగదారులకు మరింత సౌకర్యాన్ని అందించే దిశగా అలాగే సేల్స్ సమయంలో బీమాతో సహా కస్టమర్ అవసరాల కోసం "వన్ స్టాప్ షాప్"గా వస్తుంది.

వన్ మోటో ఇండియా సేల్స్ & మార్కెటింగ్ వి‌పి ఆదిత్య రెడ్డి మాట్లాడుతూ, “కస్టమర్‌లకు అత్యుత్తమ సేవలను అందించడం మా ఆశయం. దాన్ని సాధించడానికి, మేము ప్రపంచ-స్థాయి ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తులకి అదనంగా సేవలను రూపొందించడానికి ప్రయత్నిస్తున్నాము. కస్టమర్ బేస్‌లో ఎక్కువ మంది మొదటిసారిగా ఎలక్ట్రిక్ వాహనాలను ఎక్స్పిరియన్స్ చేస్తున్నారు, వారు ICE నుండి EVకి మారడానికి మరింత మద్దతును కోరుతున్నారు. మేము కస్టమర్ రిక్వైర్మెంట్ గుర్తించాము, వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నాము, తద్వారా మా కస్టమర్‌లకు ప్రతిదీ ఒకే చోట అందించబడుతుంది” అని అన్నారు.

ప్రస్తుతం, బ్రాండ్‌కు మూడు వేర్వేరు ద్విచక్ర వాహనాలు అందుబాటులో ఉన్నాయి- బైకా, ఎలెక్టా అండ్ కమ్యుటా. ఈ మూడు ఉత్పత్తులను ప్రారంభించిన తర్వాత 3 నెలల్లో బ్రాండ్ సేవలను కూడా విస్తరించడం ప్రారంభించింది.

అసోసియేషన్ గురించి కంట్రీ హెడ్, రిటైల్ ఏజెన్సీ కే‌ఎన్ మురళి “భారతదేశంలో ఎలక్ట్రిక్ 2-వీలర్ల వ్యాప్తి చాలా వేగంగా పెరుగుతోంది. పెరుగుతున్న డిమాండ్, ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణతో మేము ఈ విభాగంలో ఎనేబుల్‌గా ఉండటానికి గొప్ప అవకాశాన్ని చూస్తున్నాము. మెరుగైన అండ్ గ్రీన్ ఫ్యూచర్ కోసం దేశం ఇ-మొబిలిటీ వైపు బాధ్యతాయుతంగా మారుతున్నందున, వన్ మోటో బృందంతో మా అనుబంధం మా సహకారం ప్రభావవంతంగా ఉంటుందని మేము చూస్తున్నాము.

“వన్ మోటో ఇండియా కస్టమర్‌లు బ్రాండ్ జారీ చేసిన మోటార్ పాలసీలకు యాడ్‌ ఆన్ కవర్-డిప్రీసియేషన్ మినహాయింపు పొందవచ్చు. ఇది కాకుండా కస్టమర్‌లకు వన్ మోటో సెంటర్‌లలో క్లెయిమ్‌ల కోసం పోటీ ధర, క్యాష్ లెస్ సౌకర్యం కూడా అందించబడుతుంది.

అసోసియేషన్‌ను అనుసరించి, వన్ మోటో ఇండియా కస్టమర్‌లు బ్రాండ్ జారీ చేసిన మోటార్ పాలసీలకుయాడ్‌ ఆన్ కవర్-డిప్రీసియేషన్ మినహాయింపు పొందవచ్చు. ఇది కాకుండా, కస్టమర్‌లకు వన్ మోటో సెంటర్‌లలో క్లెయిమ్‌ల కోసం పోటీ ధర, నగదు రహిత సౌకర్యం కూడా అందించబడుతుంది. ఇ-అమ్రిట్ (భారత రవాణా కోసం వేగవంతమైన ఇ-మొబిలిటీ రివొల్యూషన్ ) కోసం భారత ప్రభుత్వం ఆమోదించిన మూడు కంపెనీలలో వన్ మోటో ఇండియా ఒకటి.

వన్ మోటో గురించి

వన్ మోటో అనేది బ్రిటీష్ మొబిలిటీ కంపెనీ ఐకానిక్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లు, బైక్‌లు, స్కూటర్‌లను రూపొందించడం ఇంకా విద్యుదీకరించడం చేస్తుంది. వన్ మోటో ఇండియాలోకి ప్రవేశించి, ఎల్లీసియం ఆటోమోటివ్స్ ద్వారా ప్రోమోట్ చేయబడింది. ఈ సంవత్సరం నవంబర్‌లో 2 ఉత్పత్తులను ప్రారంభించి, 75 డీలర్‌లతో బలమైన నెట్‌వర్క్‌ ఉంది. భారతదేశంలో, ఈ బ్రాండ్ హెడ్ ఆఫీస్ తెలంగాణలోని హైదరాబాద్‌లో ఉంది.

రాయల్ సుందరం గురించి 
రాయల్ సుందరం జనరల్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్ అనేది ఇన్సూరన్స్ రేగులేటరీ అండ్ డేవల్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా అక్టోబర్ 2000లో లైసెన్స్ పొందిన మొట్టమొదటి ప్రైవేట్ రంగ జనరల్ బీమా కంపెనీ. కంపెనీ ప్రస్తుతం సుందరం ఫైనాన్స్ (50% ఈక్విటీ హోల్డింగ్‌తో) జాయింట్ వెంచర్‌గా ఉంది - భారతదేశంలో అత్యంత గౌరవనీయమైన నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలలో (NBFCలు) ఒకటి.


రాయల్ సుందరం కుటుంబాలకు ఇంకా వ్యాపారాలకు, ప్రతిఒక్కరికీ నేరుగా అలాగే మధ్యవర్తులు ఇంకా అనుబంధ భాగస్వాముల ద్వారా ఇన్నోవేటివ్ జనరల్ ఇన్షూరెన్స్ సొల్యుషన్స్ అందిస్తోంది. కంపెనీ వ్యక్తిగత కస్టమర్లకు మోటారు, హెల్త్, పర్సనల్ ఆక్సిడెంట్, హోమ్ అండ్ ట్రావెల్ ఇన్షూరెన్స్ అందిస్తుంది ఇంకా వాణిజ్య వినియోగదారులకు ఫైర్, మేరైన్, ఇంజనీరింగ్, వ్యాపార అంతరాయ ప్రమాదాలకు సంబంధించిన ప్రత్యేక బీమా ఉత్పత్తులను అందిస్తుంది. రాయల్ సుందరం చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఇంకా రైతులతో సహా గ్రామీణ వినియోగదారులకు ప్రత్యేకంగా రూపొందించిన ఉత్పత్తులను కూడా అందిస్తుంది. ప్రముఖ బ్యాంకులు, ఎన్‌బిఎఫ్‌సిలతో ధీర్గకాల టై-అప్‌ ఉన్న కంపెనీ భారతదేశంలో బ్యాంకాస్యూరేస్‌లో అగ్రగామిగా ఉంది.