Asianet News TeluguAsianet News Telugu

క్లౌడ్‌ కంప్యూటింగ్‌పై పట్టుంటే చాలు: నాలుగేళ్లలో 10 లక్షల కొలువులు


మున్ముందు క్లౌడ్ కంప్యూటింగ్‌పై కొంచెం పట్టు.. ఆ పై ఒకటి రెండేళ్ల అనుభవం ఉంటే చాలు.. నెలకు రూ.7 లక్షల వరకు వేతనం పొందొచ్చు. 2022 నాటికి క్లౌడ్ కంప్యూటింగ్ రంగంలో 10 లక్షలకు పైగా నిపుణుల నియామకాలు జరుగుతాయని గ్రేట్ లెర్నింగ్ అనే సంస్థ నిర్వహించిన అధ్యయనంలో తేలింది. 

One million cloud computing jobs to be created by 2022 in India: report
Author
New Delhi, First Published Nov 24, 2018, 6:20 PM IST

న్యూఢిల్లీ: ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా క్లౌండ్‌ కంప్యూటింగ్‌ వ్యవస్థ ప్రబలంగా మారుతుండటంతో భవిష్యత్‌లో ఈ విభాగంలో దండిగా కొత్త కొలువులు అందుబాటులోకి రానున్నాయి. దేశంలోని చిన్నతరహా పరిశ్రమలతోపాటు భారీ కంపెనీలు కూడా తమ ఐటీ అవసరాల కోసం క్లౌడ్‌ కంప్యూటింగ్‌ను ఆశ్రయిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 2022 నాటికి ఈ రంగంలో కొత్తగా దాదాపు 10 లక్షలకు పైగా ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి. టెక్‌ ఎగ్జిక్యూటివ్స్‌ ఎల్‌-టెక్‌ ప్లాట్‌ఫాం 'గ్రేట్‌ లెర్నింగ్‌' నిర్వహించిన అధ్యయనంలో తేలింది. సంప్రదాయ ఐటీ వ్యయం కంటే కూడా 4.5 రెట్లు అధికంగా క్లౌడ్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌పై ఐటీ సంస్థలు వ్యయం చేస్తున్నాయని ఈ నివేదిక తెలిపింది. 

క్లౌడ్‌ కంప్యూటింగ్‌ రంగం 2020 నాటికి మరింత వేగం పుంజుకోనుందని గ్రేట్‌ లెర్నింగ్ నివేదిక తెలిపింది. భారత క్లౌడ్‌ కంప్యూటింగ్‌ మార్కెట్‌ ప్రస్తుతం 2.2 బిలియన్‌ డాలర్లుగా ఉందని, 2020 నాటికి ఇది 30 శాతం వృద్ధితో 4.01 బిలియన్‌ డాలర్లకు చేరే అవకాశం ఉందని నివేదిక తెలిపింది. సీనియర్‌ క్లౌడ్‌ ఎక్స్‌పర్ట్స్‌, నియామక మేనేజర్లతో పాటు ఐటీ రంగానికి చెందిన రిసెర్చ్‌ నివేదికలను విశ్లేషించిన తర్వాత తాము ఈ నివేదికను రూపొందించామని 'గ్రేట్‌ లెర్నింగ్‌' వెల్లడించింది. 

భవిష్యత్‌లో ఐటీ వ్యయం ఎక్కువగా ప్రైవేట్, పబ్లిక్‌, హైబ్రిడ్‌ క్లౌడ్‌ ఎన్విరాన్‌మెంట్‌లోనే నమోదయ్యే అవకాశం ఉందని నివేదిక తెలిపింది. క్లౌడ్‌ కంప్యూటింగ్‌ వ్యవస్థలో కంపెనీలకు భారీగా వ్యయ నియంత్రణ కలిసి వస్తున్న నేపథ్యంలో ఎక్కువగా సంస్థ సంప్రదాయ డేటా సెంటర్స్‌ విధానం నుంచి క్లౌడ్‌బేస్డ్‌ అప్లికేషన్స్‌పై దృష్టి సారిస్తూ వస్తున్నాయని నివేదిక తెలిపింది. 

కొత్తవారికి రూ.3-5 లక్షల జీతం..
కొత్తగా ఉద్యోగంలో చేరే ఐటీ ఇంజినీర్‌ ఏడాదికి రూ.3-5 లక్షల వేతనం అందుకుంటూ ఉంటే, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ ప్లాట్‌ఫామ్‌పై కొత్తగా కొలువులో చేరే వారు (0-2 ఏండ్ల అనుభవం) రూ.5-7 లక్షల జీతం పొందుతున్నారని అధ్యయనం తెలిపింది. క్లౌడ్‌ విభాగంలో ఐదేళ్ల కంటే తక్కువగా అనుభవంతో కొలువులో చేరే వారు రూ.12-19 లక్షల జీతాన్ని, మిడిల్‌ లేవల్‌ మేనేజర్లు సులువుగా రూ.20 లక్షల వరకు జీతాలను పొందుతున్నారని తమ అధ్యయనంలో తేలిదని గ్రేట్ లెర్నింగ్ నివేదిక తెలిపింది. కౌడ్‌ ఆర్కిటెక్చర్చ్స్‌, 10-15 సంవత్సరాల అనుభవం కలిగిన ఇతర స్పెషలిస్టులు వార్షికంగా రూ.30 లక్షల వరకు జీతభత్యాల రూపంలో ఆర్జిస్తున్నారని నివేదిక తెలిపింది. క్లౌడ్‌తో ఐటీ స్వరూపం మారనుందని తెలిపింది.

Follow Us:
Download App:
  • android
  • ios