Asianet News TeluguAsianet News Telugu

రూ.2000 చెల్లిస్తే సరి! 2 గంటలు సెల్ఫ్ డ్రైవ్.. ఓలా వినూత్న సర్వీస్

క్యాబ్ అగ్రిగేటర్ ‘ఓలా’ క్యాబ్ తాజాగా ‘ఓలా డ్రైవ్’ పేరిట సెల్ఫ్ డ్రైవింగ్’ సర్వీసును అందుబాటులోకి తెచ్చింది. రూ.2000 చెల్లిస్తే రెండు గంటల పాటు సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకోవచ్చు. ప్రయోగాత్మకంగా బెంగళూరులో ఈ సేవలను ప్రారంభించిన ఓలా క్యాబ్స్ త్వరలో హైదరాబాద్, ముంబై, ఢిల్లీ నగరాల్లో ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది.

Ola rolls out self-drive cab rental service in Bengaluru
Author
Hyderabad, First Published Oct 18, 2019, 4:07 PM IST

న్యూఢిల్లీ: అసలే క్యాబ్ అంటేనే రెంటల్ సర్వీస్.. అలా క్యాబ్ సర్వీసుల్లో వినూత్న మార్పులు తీసుకు వచ్చిన ఓలా సంస్థ తాజాగా ‘ఓలా డ్రైవ్’ పేరిట గురువారం అధికారికంగా సెల్ఫ్ డ్రైవ్ కారు రెంటల్ సర్వీస్‌‌ల్లోకి అడుగుపెట్టింది. వచ్చే ఏడాది చివరి నాటికి 20 వేల వెహికిల్స్‌‌ను యాడ్ చేయాలనేదే ఓలా లక్ష్యం. ఈ సర్వీసులను తొలుత పైలెట్ ప్రాజెక్ట్‌‌గా బెంగళూరులో ప్రారంభించింది.

‘ఓలా డ్రైవ్’ క్యాబ్ రెంటల్ సర్వీసులను హైదరాబాద్, ముంబై, న్యూఢిల్లీలో త్వరలోనే ప్రారంభించేయాలని ఓలా ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ స్పేస్‌‌లో ఉన్న ఇతర ప్రత్యర్థులతో పోలిస్తే 30 శాతం తక్కువగా సెల్ఫ్ డ్రైవ్ కార్లను అందిస్తామని ఓలా చెబుతోంది.

రెసిడెన్షియల్, కమర్షియల్ హబ్స్‌‌లోని పలు పికప్ స్టేషన్ల ద్వారా ఓలా ఈ సర్వీసులను యూజర్లకు ప్రవేశపెట్టింది. రూ.2000 డిపాజిట్‌ చెల్లించి రెండు గంటల కోసం యూజర్లు తమకు నచ్చిన కారును బుక్ చేసుకోవచ్చు.

ఈ సర్వీసును షార్ట్ టర్మ్ సెల్ఫ్ డ్రైవ్ కారు షేరింగ్‌‌ సర్వీస్‌‌గా ఆఫర్‌‌‌‌ చేస్తున్నామని ఓలా చీఫ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ ఆఫీసర్ అరుణ్ చెప్పారు. లాంగ్ టర్మ్ సబ్‌‌స్క్రిప్షన్‌‌ను, కార్పొరేట్ లీజింగ్, ఇతర ఆప్షన్లను కూడా ప్రవేశపెట్టనున్నామని తెలిపారు.

ఓలా డ్రైవర్ విస్తరణ కోసం ప్రస్తుతం 200 మిలియన్ల డాలర్లు పెట్టుబడి పెట్టింది. భవిష్యత్తులో సంస్థ 500 మిలియన్ల డాలర్ల వరకు పెట్టుబడి పెట్టనున్నది. భారతదేశంలో కారు షేరింగ్ మార్కెట్లో ఓలా డ్రైవ్ పూర్తిగా ట్రాన్స్ ఫర్మేటివ్ రోల్‌ను నిర్వచిస్తుందని అరుణ్ శ్రీనివాస్ తెలిపారు. ఓలా డ్రైవ్ కార్లన్నీ పూర్తిగా ఓలా ప్లే ప్లాట్ ఫాంతో కనెక్టవుతాయి. ఏడంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్, జీపీఎస్, మీడియా ప్లే బ్యాక్, బ్లూటూత్ కనెక్టివిటీ తదితర సర్వీసులు ఉంటాయి.

24 గంటల పాటు హెల్ప్ లైన్ పని చేస్తూ ఉంటుంది. ఎమర్జెన్సీ బటన్ నొక్కితే ఓలా డెడికేటెడ్ సేఫ్టీ రెస్పాన్స్ టీం సరైన సమయంలో సర్వీస్ అందిస్తుంది. ఓలా డ్రైవ్ పూర్తిగా రిలయబుల్, సెక్యూర్, కంఫర్టబుల్ డ్రైవింగ్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుందని ఓలా క్యాబ్స్ వివరించింది.

Follow Us:
Download App:
  • android
  • ios