Asianet News TeluguAsianet News Telugu

మంటపుట్టిస్తున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. వరుసగా నేడు మళ్ళీ పెంపు...

తొమ్మిది రోజుల వరుస ధరల పెరుగుదల తరువాత, ఇంధన రేట్లు ఇప్పుడు సంవత్సరానికి పైగా అత్యధిక స్థాయిని  నమోదు చేస్తున్నాయి. ఈ రోజు పెట్రోల్ ధర లీటరుకు 46 పైసలు పెంచగా, డీజిల్ ధర లీటరుకు 59 పైసలు పెంచింది.
 

oil companies Petrol, diesel prices hiked again for ninth day
Author
Hyderabad, First Published Jun 15, 2020, 11:38 AM IST

న్యూ ఢిల్లీ: ముడి చమురు పెట్రోల్, డీజిల్ రెండింటి  ధరలు అధిక స్థాయిని నమోదు చేసింది. తొమ్మిది రోజుల వరుస ధరల పెరుగుదల తరువాత, ఇంధన రేట్లు ఇప్పుడు సంవత్సరానికి పైగా అత్యధిక స్థాయిని  నమోదు చేస్తున్నాయి.

ఈ రోజు పెట్రోల్ ధర లీటరుకు 46 పైసలు పెంచగా, డీజిల్ ధర లీటరుకు 59 పైసలు పెంచింది. 82 రోజుల లాక్ డౌన్ విరామం తరువాత చమురు సంస్థలు పెట్రోల్ ధరపై లీటరుకు రూ. 4.98, డీజిల్ ధర లీటరుకు రూ.5.23 పెరిగింది.

అగ్ర నగరాల్లో తాజా పెట్రోల్, డీజిల్ ధరలు:

న్యూ ఢిల్లీ: పెట్రోల్ రూ.76.26 డీజిల్ రూ. 74.62

గుర్గావ్: పెట్రోల్ రూ. 75.05. డీజిల్ రూ. 67.45

ముంబై: పెట్రోల్ రూ. 83.17. డీజిల్ రూ. 73.21

చెన్నై: పెట్రోల్ రూ.79.96. డీజిల్ రూ.72.69

హైదరాబాద్: పెట్రోల్ రూ.79.17. డీజిల్ రూ.72.93

బెంగళూరు: పెట్రోల్ రూ. 78.73. డీజిల్ రూ. 70.95

ముడి చమురు రేట్లు క్షీణిస్తున్నప్పటీకి, దేశీయంగా ఇంధర ధరలు రికార్డు స్థాయికి చేరాయి. భారతదేశంలో ఆటోమొబైల్ ఇంధన రేట్లు ప్రస్తుతం పెరగడం ఎక్సైజ్ సుంకం పెట్రోల్‌పై లీటరుకు 10డాలర్లు గత నెలలో డీజిల్‌కు 13 డాలర్లు పెంచింది. అంతేకాకుండా అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇంధనంపై వ్యాట్/ సెస్ పెంచాయి.

కొన్ని నివేదికల ప్రకారం చమురు మార్కెటింగ్ కంపెనీలు నష్టాలను తగ్గించుకోవడానికి రాబోయే కొద్ది రోజులలో కూడా ఇంధన రేట్లను పెంచాలని యోచిస్తున్నాయి. ఇంధన రిటైల్ ధరలో 70% పన్నులు (ఎక్సైజ్ సుంకాలు, వ్యాట్, సెస్, మొదలైనవి) ఉన్నందున, ఇటీవల ఎక్సైజ్ సుంకం పెంపును వెనక్కి తీసుకొవాలని, వస్తువులు, సేవల పరిధిలోకి పెట్రోలియం వస్తువులను తీసుకురావాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. 

కాంగ్రెస్ చీఫ్ ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం తన పదవీకాలంలో పెంచిన అన్ని ఎక్సైజ్ సుంకాలను వెనక్కి తీసుకుంటే, పెట్రోల్, డీజిల్ ఇంధనాల ధరలు లీటరుకు రూ.50 కంటే తక్కువకు తగ్గుతుందని అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios