ఇండియాలో అక్టోబరు నెలలో డీజిల్ వినియోగం 6.6% పెరిగింది, మార్చి చివరిలో కోవిడ్-19 వ్యాప్తి కారణంగా లాక్ డౌన్ విధించిన తరువాత మొదటిసారి పెరుగుదల నమోదైంది, దీనికి సంబంధించిన ప్రాథమిక డేటాను ఆదివారం వెల్లడించింది.  

దేశంలో అతిపెద్ద రిఫైనరి, ఇంధన రిటైలర్ అయిన ఇండియన్ ఆయిల్ కార్ప్ (ఐఓసి) సమాచారం ప్రకారం దేశంలోని మూడు రాష్ట్రల ఇంధన రిటైలర్ల డీజిల్ అమ్మకాలు అక్టోబర్ మొత్తం 6.17 మిలియన్ టన్నులకు చేరింది.

భారతదేశ ఇంధన డిమాండ్ లో రెండు వంతుల వాటా కలిగిన డీజిల్ అమ్మకాలు సెప్టెంబర్ నుండి 27.5% పెరిగాయి. స్థానికంగా ఇంధన డిమాండ్ పెరుగుతున్నందున రెండు నెలల్లో పూర్తి సామర్థ్యంతో  రిఫైనరీలు నిర్వహించాలని ఐఓసి భావిస్తోంది కంపెనీ చైర్మన్ ఎస్.ఎమ్. వైద్య శుక్రవారం చెప్పారు.

also read  మొదటిసారి 1 లక్ష కోట్లు దాటిన జీఎస్‌టీ వసూళ్లు.. గత ఏడాదితో పోలిస్తే 10శాతం ఆదాయం వృద్ధి.. ...

భారతదేశంలో పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ డిమాండ్ కూడా దెబ్బతిన్న ఇతర మార్కెట్లకు సహాయపడాలి. అక్టోబర్‌లో స్థానికంగా పెట్రోల్ అమ్మకాలు కరోనా లాక్ డౌన్  కంటే ముందు స్థాయికి చేరాయి.

పెట్రోల్ అమ్మకాలు ఏడాది క్రితం నుండి 4% పెరిగి 2.4 మిలియన్ టన్నులకు చేరుకున్నాయి, ఇది సెప్టెంబర్ నెల కంటే 8.6% ఎక్కువ. రాష్ట్ర కంపెనీలు ఐఓసి, హిందూస్తాన్ పెట్రోలియం కార్ప్, భారత్ పెట్రోలియం భారతదేశ రిటైల్ ఇంధన కేంద్రాలలో 90% వాటా  ఉంది.

రాష్ట్ర రిటైల్ వ్యాపారులు గతఏడాది కంటే 3.8% ఎక్కువగా కూకింగ్ గ్యాస్ విక్రయించారు. ఇది సుమారు 2.44 మిలియన్ టన్నులు, జెట్ ఇంధన అమ్మకాలు 3,28,000 టన్నులతో సగానికి పడిపోయాయి.