నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజీని పట్టి కుదిపేస్తున్న కో లొకేషన్‌ కుంభకోణం కేసులో కీలక పాత్రధారి ఆనంద్‌ సుబ్రమణియన్‌ను నేడు సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ అరెస్ట్‌ చేసింది. ఈరోజు ఉదయం సీబీఐ అధికారులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు.

ముంబై : నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మాజీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆనంద్ సుబ్రమణియన్‌ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) గురువారం రాత్రి అరెస్టు చేసీన సంగతీ మీకు తెలిసిందే.“చెన్నైలో మూడు రోజుల విచారణ తర్వాత సుబ్రమణియన్‌ అరెస్టు జరిగింది. అతనిని కస్టడీ కోసం ప్రత్యేక కోర్టు ముందు హాజరు పరుస్తారు, ”అని ఒక వ్యక్తి చెప్పాడు.

పేరు చెప్పడానికి నిరాకరించిన రెండవ వ్యక్తి ప్రకారం, ఎన్‌ఎస్‌ఈ మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ చిత్రా రామకృష్ణతో కమ్యూనికేట్ చేస్తున్న హిమాలయ 'యోగి' సుబ్రమణియన్ తప్ప మరెవరో కాదని సి‌బి‌ఐ నిర్ధారించింది.సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (sebi), ఫిబ్రవరి 11న ఆమోదించిన ఉత్తర్వులలో ఆర్థిక డేటాతో సహా ఒక తెలియని ఇమెయిల్ ఐడి: rigyajursama@outlook.comకి ఎన్‌ఎస్‌ఈ నుండి సున్నితమైన సమాచారాన్ని లీక్ చేసినందుకు రామకృష్ణని దోషిగా నిర్ధారించారు.

ల్యాప్‌టాప్‌లు ధ్వంసమయ్యాయి, అయితే ల్యాప్‌టాప్ ఐ‌పి అడ్రస్, ఇమెయిల్ ఐ‌పి అడ్రస్ ఒకేలా ఉన్నాయి. తెలియని ఐడీ ద్వారా సుబ్రమణియన్ సొంత ఐడీకి ఫార్వార్డ్ చేసిన ఈమెయిల్స్ స్క్రీన్‌షాట్‌లను కూడా సీబీఐ కనుగొంది. ఇంకా, అతను ఇమెయిల్ ఐడిని సృష్టించినట్లు రుజువు కూడా లభించింది. సమాచారం లీకేజీ అంతటితో ఆగలేదని, ఇతరులకు కూడా చేరిపోయి ఉంటుందని సీబీఐ అనుమానిస్తోంది. ఈ కారణంగానే సీబీఐ కోర్టును సుబ్రమణియన్‌ రిమాండ్ కోసం కోరుతోంది’’అని రెండో వ్యక్తి చెప్పాడు.

ఎన్‌ఎస్‌ఈ మాజీ చీఫ్ రామకృష్ణకు సలహా ఇచ్చిన రహస్యమైన “హిమాలయ యోగి” స్వయంగా సుబ్రమణియన్ అని ఒక నివేదిక నివేదించింది. దీనిని ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించిన E&Y అండ్ NSE ధృవీకరించింది, అయితే స్టాక్ మార్కెట్ రేగులేటరీ సంస్థ దీనిని నమ్మదగినదిగా గుర్తించలేదు.

ఈ కేసు ఎన్‌ఎస్‌ఈ కొ-లొకేషన్ లేదా ఆల్గో ట్రేడింగ్ ప్లాట్‌ఫారమ్‌లో ఆన్ ఫేర్ యాక్సెస్‌కు సంబంధించినది. ఈ కేసులో ఎఫ్‌ఐఆర్ మే 2018లో నమోదైంది. అసలు ఎఫ్‌ఐఆర్ ఢిల్లీకి చెందిన బ్రోకరేజ్ OPG సెక్యూరిటీస్ అండ్ పేరులేని NSE ఇంకా సెబీ అధికారులపై నమోదు చేయబడింది.

ఎన్‌ఎస్‌ఈ ఆల్గో-ట్రేడింగ్ ప్లాట్‌ఫారమ్‌ను యాక్సెస్ చేస్తున్నప్పుడు కొంతమంది బ్రోకర్లు ఇతరులపై అన్యాయమైన ప్రయోజనాన్ని పొందడం, తద్వారా అనవసర లాభాలు పొందడం లేదా నష్టాలను నివారించడం ఈ స్కామ్‌లో ఉంది.

బోర్డు మాజీ వైస్‌ చైర్మన్‌ రామకృష్ణ, రవి నరేన్‌లను సీబీఐ గత శుక్రవారం నుంచి ప్రశ్నిస్తోంది. "ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరుగుతాయి" అని పైన పేర్కొన్న ఒక వ్యక్తి చెప్పారు. సెబీ ఆదేశాలను అనుసరించి ఇటీవల వెలుగులోకి వచ్చిన వాస్తవాల వెలుగులో ఒరిజినల్ ఎఫ్‌ఐఆర్‌ను విస్తరించారు. సుబ్రమణియన్‌ నియామకంలోనూ, రామకృష్ణ ఆర్థిక డేటా లీకేజీలోనూ గవర్నెన్స్ లోపాలున్నాయని సెబీ ఆరోపించింది.

ఆల్గో ట్రేడింగ్‌లో విచారణను విస్తృతం చేయాలని కోరుతూ జర్నలిస్ట్ శంతను గుహ రే ఆగస్టు 2017లో ఢిల్లీ హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేశన్ (పిఐఎల్) దాఖలు చేసిన తర్వాత దర్యాప్తు ప్రారంభించబడింది. మే 2019లో సీబీఐ విచారణ ఒరిజినల్ ఫిర్యాదుకే పరిమితం కాదంటూ ఢిల్లీ హైకోర్టుకు స్టేటస్ రిపోర్టును సమర్పించింది.