ఈ వారం మొదటి రోజు ట్రేడింగ్ అంటే సోమవారం స్టాక్ మార్కెట్ పెరుగుదలతో ప్రారంభమైంది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ ఇండెక్స్ సెన్సెక్స్ 42393.99 స్థాయిలో 503.93 పాయింట్లతో (1.20 శాతం) ప్రారంభమైంది.

నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 135.85 పాయింట్ల (1.11 శాతం) లాభంతో 12399.40 వద్ద ప్రారంభమైంది. గ్లోబల్ మార్కెట్ల నుండి సానుకూల సంకేతాలు, విదేశాల నుండి బలమైన పెట్టుబడుల ప్రవాహం కారణంగా సెన్సెక్స్ సోమవారం ట్రేడింగ్ ప్రారంభంలో 650 పాయింట్లు పెరిగి 42,566.34 రికార్డు స్థాయికి చేరుకుంది.  

ఇండెక్స్ 2020 సంవత్సరంలో మొత్తం నష్టాన్ని తిరిగి పొందింది. ఇది 1 జనవరి  2020న 41,306.02 వద్ద ముగిసింది. అమెరికా ఎన్నికల్లో జో బైడెన్ గెలుపు ప్రభావం స్పష్టంగా కనిపించింది.

గతవారం ఐదు ట్రేడింగ్ సెషన్లలో స్టాక్ మార్కెట్ అనుకూలంగా ముగిసింది. సెన్సెక్స్ 10 నెలల గరిష్ట స్థాయికి చేరుకుంది. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం మార్కెట్ అస్థిరత కొనసాగుతుంది. అందువల్ల పెట్టుబడిదారులు జాగ్రత్తగా ఉండాలి. గత వారం 30 షేర్ల బిఎస్ఇ సెన్సెక్స్ 2,278.99 పాయింట్లు అంటే 5.75 శాతం లాభపడింది. 

also read నవంబర్ 30లోగా మీ రేషన్ కార్డ్ అప్‌డేట్ చేసుకోండి .. లేదంటే డిసెంబర్ నుండి రేషన్ కట్.. ...

 టాప్ 10 సెన్సెక్స్ కంపెనీలలో తొమ్మిది మార్కెట్ క్యాపిటలైజేషన్ (మార్కెట్ క్యాప్) గత వారం రూ .2,30,219.82 కోట్లు పెరిగింది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ అత్యధిక లాభాలను ఆర్జించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ మినహా, టాప్ 10 కంపెనీలలో తొమ్మిది కంపెనీలు ఈ వారంలో మార్కెట్ క్యాపిటలైజేషన్ పెరిగాయి.

టాప్ 10 కంపెనీల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ మొదటి స్థానాన్ని నిలుపుకుంది. తరువాత టిసిఎస్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, హిందుస్తాన్ యూనిలీవర్, ఇన్ఫోసిస్, హెచ్‌డిఎఫ్‌సి, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, భారతి ఎయిర్‌టెల్, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ వరుసగా ఉన్నాయి.

 ఇన్ఫోసిస్, హెచ్‌సిఎల్ టెక్, బ్రిటానియా, శ్రీ సిమెంట్ ప్రారంభం వేగంగా ఉన్నాయి. అలాగే జెఎస్‌డబ్ల్యు స్టీల్, టాటా స్టీల్, ఎస్‌బిఐ, ఎస్‌బిఐ లైఫ్ షేర్లు రెడ్ మార్క్ మీద ప్రారంభమయ్యాయి.

ఇండెక్స్ పరిశీలిస్తే, అన్ని రంగాలు ఈ రోజు గ్రీన్ మార్క్ మీద ఓపెన్ అయ్యాయి. వీటిలో బ్యాంకులు, ఫైనాన్స్ సర్వీసెస్, ప్రైవేట్ బ్యాంకులు, రియాల్టీ, పిఎస్‌యు బ్యాంకులు, ఎఫ్‌ఎంసిజి, ఫార్మా, ఐటి, ఆటో ఉన్నాయి.

సెన్సెక్స్ ఉదయం 9.02 గంటలకు ప్రీ-ఓపెన్ సమయంలో 2313.62 పాయింట్లు లేదా 0.57 శాతం, 42131.68 వద్ద ఉంది. అదే సమయంలో, నిఫ్టీ 123.50 పాయింట్లు లేదా 1.01 శాతం పెరిగి 12387 స్థాయిలో ఉంది.

అంతకు ముందు ట్రేడింగ్ రోజు గ్రీన్ మార్క్ మీద ముగిసింది. సెన్సెక్స్ 1.34 శాతం పెరిగి 5518.90 పాయింట్ల వద్ద 41893.06 వద్ద, నిఫ్టీ 1.18 శాతం (143.25 పాయింట్లు) పెరిగి 12263.55 వద్ద ముగిసింది.