ఇప్పుడు మీ PF బ్యాలెన్స్ తెలుసుకోవడానికి EPFO ఆఫీసుకి వెళ్లాల్సిన అవసరం లేదు. భారత ప్రభుత్వ యాప్ ద్వారా నిమిషాల వ్యవధిలో తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ఈ యాప్ ద్వారా ఇతర పనులు కూడా చేయవచ్చు.
ఇప్పుడు మీరు భారత ప్రభుత్వ యాప్ ద్వారా PF బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. దీని కోసం ఈపీఎఫ్ఓ ఆఫీసుకి వెళ్లాల్సిన అవసరం లేదు. 2017 సంవత్సరంలోనే ప్రజలు వివిధ ప్రభుత్వ సేవలను సులభంగా పొందేందుకు కేంద్ర ప్రభుత్వం ఉమంగ్ యాప్‌ను ప్రారంభించింది. ఈ యాప్ ద్వారా వేలాది రకాల ప్రభుత్వ సేవల గురించి సమాచారాన్ని తెల్సుకోవచ్చు, పొందవచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ యాప్ ద్వారా 20689 రకాల ప్రభుత్వ సేవలను పొందవచ్చు. UMANG యాప్ ద్వారా ప్రావిడెంట్ ఫండ్ మాత్రమే కాకుండా డిజిలాకర్, ఎన్‌పిఎస్, పాన్ కార్డ్, గ్యాస్ సిలిండర్ బుకింగ్, యుటిలిటీ బిల్లుకు సంబంధించిన ఇతర సేవలను కూడా పొందవచ్చు.
ఆండ్రాయిడ్ ఫోన్‌లను ఉపయోగించే, ఐఫోన్‌ను ఉపయోగించే వినియోగదారులు యాప్ స్టోర్ నుండి ఉమంగ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే 9718397183కు మిస్డ్ కాల్ చేయడం ద్వారా యాప్ లింక్‌ను కూడా పొందవచ్చు. అంతేకాకుండా, https://web.umang.gov.in నుండి కూడా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఎక్కువగా ప్రజలు ప్రావిడెంట్ ఫండ్ నుండి డబ్బును కష్ట సమయాల్లో తీస్తుంటారు. కరోనావైరస్ మహమ్మారి సమయంలో చాలా మంది ఉద్యోగాలను కోల్పోయారు. అటువంటి సంక్షోభ సమయాల్లో చాలా మంది ప్రజలు ప్రావిడెంట్ ఫండ్ నుండి డబ్బును ఉపసంహరించుకున్నారు. అలాగే పీఎఫ్ ఖాతా గురించి తెలియని వారు చాలా మంది ఉన్నారు. వీరు పిఎఫ్ డబ్బును విత్‌డ్రా చేయడంలో సమస్యలను ఎదుర్కొంటుంటారు. UMANG యాప్ ద్వారా PF బ్యాలెన్స్ తెలుసుకోవడం చాలా సులభం.
ఎలా అంటే ?
ముందుగా మీ ఫోన్‌లో UMANG యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. దీని తర్వాత UMANG యాప్‌ని తెరిచి EPFO సింబల్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఎంప్లాయీ సెంట్రిక్ సర్వీస్‌పై క్లిక్ చేయండి. తర్వాత పాస్‌బుక్‌పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీ UAN నంబర్‌ని ఎంటర్ చేసి, గెట్ OTPపై క్లిక్ చేయండి. ఇలా చేసిన వెంటనే మీరు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTPని వస్తుంది. ఇప్పుడు OTPని ఎంటర్ చేయండి. దీని తర్వాత ఈపీఎఫ్ అక్కౌంట్ వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. దీని తర్వాత మీరు మీ PF అక్కౌంట్ బ్యాలెన్స్‌ని చెక్ చేయవచ్చు.
