మీరు దేశంలోని ఏ పెద్దు బ్యాంకులో అయినా ఎఫ్‌డిని చేయడానికి వెళితే, అక్కడ మీకు 5-7 శాతం వడ్డీ రేటు పొందుతారు. అయితే కొన్ని బ్యాంకులు కూడా సేవింగ్స్ ఖాతాపైనే 7% వరకు సేవింగ్స్ అకౌంట్ పై వడ్డీ రేట్లు అందిస్తున్నాయి.
సేవింగ్స్ అకౌంట్ అనేది ఏదైనా వ్యక్తి ఆర్థిక ప్రయాణంలో మొదటి అడుగు. సేవింగ్స్ అకౌంట్ పై వడ్డీ సాధారణంగా రోజు చివరిలో ఖాతాలోని బ్యాలెన్స్‌పై లెక్కిస్తారు. ఇది త్రైమాసిక ప్రాతిపదికన చెల్లిస్తారు. పెద్ద బ్యాంకుల్లో సేవింగ్స్ అకౌంట్ లపై అతి తక్కువ వడ్డీ ఇస్తారు. మీ సేవింగ్స్ అకౌంట్ పై మీకు ఎక్కువ వడ్డీ కావాలంటే స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, చెల్లింపు బ్యాంకులు మంచి ఎంపికలు. సేవింగ్స్ ఖాతాపై బంపర్ వడ్డీని అందిస్తున్న కొన్ని బ్యాంకుల గురించి తెలుసుకుందాం.
ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్
ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ సేవింగ్స్ ఖాతాలో 1 నుండి 2 లక్షల వరకు ఉన్న బ్యాలెన్స్‌పై 7 శాతం వరకూ మీరు మంచి వడ్డీ రాబడిని పొందే వీలుంది. అదే సమయంలో, రూ. 1 లక్ష వరకు ఉన్న బ్యాలెన్స్‌పై వడ్డీ 2 శాతం పొందే అవకాశం ఉంది.
ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రూ. 1 లక్ష వరకు ఉండే బ్యాలెన్స్‌పై దాదాపు 3.5 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేస్తోంది. అలాగే ఈ బ్యాంక్ రూ. 1 లక్ష నుండి రూ. 5 లక్షల మధ్య బ్యాలెన్స్‌పై 5.25 శాతం వడ్డీని అందుబాటులో ఉంచింది. రూ. 5 లక్షల కంటే ఎక్కువ బ్యాలెన్స్‌పై 7 శాతం వడ్డీ రేటును అందించేందుకు సిద్ధంగా ఉంది.
ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రూ. 5 లక్షల కంటే ఎక్కువ సేవింగ్స్ అకౌంట్ బ్యాలెన్స్ ఉంటే అత్యధికంగా 7.11 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేస్తోంది. అదే సమయంలో, బ్యాంక్ రూ. 1 నుండి రూ. 5 లక్షల మధ్య బ్యాలెన్స్‌పై 6.11 శాతం వడ్డీ రేటును అందిస్తోంది.
ESAF స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
ESAF స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రూ. 5 లక్షల వరకు బ్యాలెన్స్‌పై 4% వడ్డీ రేటును అందిస్తోంది. ఇది కాకుండా, ఈ బ్యాంక్ రూ. 15 లక్షల కంటే ఎక్కువ బ్యాలెన్స్‌పై 6.5% వడ్డీ రేటును అందిస్తోంది.
AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రూ. 25 లక్షల నుండి రూ. 1 కోటి లోపు సేవింగ్స్ అకౌంట్ బ్యాలెన్స్‌పై 7% వడ్డీని అందిస్తోంది.
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 5 లక్షల కంటే ఎక్కువ సేవింగ్స్ అకౌంట్ బ్యాలెన్స్‌పై 7% వడ్డీ రేటును అందిస్తోంది. అదే సమయంలో రూ.లక్ష నుంచి రూ.5 లక్షల మధ్య బ్యాలెన్స్‌పై 6.75 శాతం వడ్డీ చెల్లిస్తోంది.
