న్యూఢిల్లీ: సబ్సిడీ రహిత ఎల్పీజీ లేదా వంట గ్యాస్ ధర పెరిగింది. పెరిగిన ధర బుధవారం నుంచి అంటే జనవరి 1 నుంచే అమలులోకి వచ్చింది. నెలలో ఈ ధర పెరగడం ఇది ఐదోసారి. సిలిండర్ గ్యాస్ ధర ఢిల్లీలో 19 రూపాయలు పెరగగా, ముంబైలో 19.5 రూపాయలు పెరిగింది. 

ధర పెంపుతో ఢిల్లీలో ఎల్పీజీ ధర 714 రూపాయలకు చేరుకోగా, ముంబైలో రూ. 684.50కు చేరుకుంది. కోల్ కతా లో సిలిండర్ గ్యాస్ ధర రూ.21.5 పెరిగింది. దీంతో కోల్ కతాలో సిలిండర్ ధర 747 రూపాయలు పలుకుతుంది. చెన్నైలో సిలిండర్ గ్యాస్ ధర 20 రూపాయలు పెరిగింది. 734 రూపాయలకు చేరుకుంది.

ప్రస్తుతం ప్రభుత్వం 14.2 కిలోల చొప్పున ఉండే 12 సిలిండర్లపై ఏడాదికి ప్రతి ఇంటికీ సబ్సిడీ ఇస్తోంది. అదనంగా కావాలంటే మార్కెట్ రేటుకు తీసుకోవాల్సి ఉంటుంది. 12 సిలిండర్ల గ్యాస్ పై కూడా నెలనెలకూ మారుతూ ఉంటుంది.