సారాంశం
స్క్రాప్ నుండి మెటీరియల్‌ని సేకరించి పెట్రోల్, డీజిల్ అవసరం లేకుండా నడిచే ఓ సెవెన్ సీటర్ బైక్‌ను తయారు చేసి, దానితో ఓ యువకుడు విజయవంతంగా ప్రయాణిస్తున్న వైరల్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
మన దేశంలో ప్రతిభకు కొదవలేదు. ప్రతికూల పరిస్థితులలో కూడా కొందరు తమ నైపుణ్యాలను ప్రపంచం ముందు ఉంచడంలో సిద్ధహస్తులు. అలాంటి వ్యక్తులు చాలా మంది వెలుగులోకి వచ్చారు. స్క్రాప్ నుండి మెటీరియల్‌ని సేకరించి పెట్రోల్, డీజిల్ అవసరం లేకుండా నడిచే ఓ సెవెన్ సీటర్ బైక్‌ను తయారు చేసి, దానితో ఓ యువకుడు విజయవంతంగా ప్రయాణిస్తున్న వైరల్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
ఈ వైరల్ వీడియోలో, ఏడుగురు యువకులు సోలార్ ప్యానెల్ అమర్చిన ఏడు సీట్ల వాహనంపై ప్రయాణిస్తున్నట్లు చూడవచ్చు. సోలార్ ప్యానెల్ సూర్యుడి నుండి శక్తిని గ్రహించడమే కాకుండా ప్రయాణీకులకు నీడను అందిస్తోంది. ఈ కొత్త ఆవిష్కరణ సోషల్ మీడియాలో చాలా మందిని ఆకట్టుకుంది. అంతేకాదు కొందరు కార్పోరేట్ దిగ్గజాల ప్రశంసలను పొందింది.
ప్రముఖ పారిశ్రామిక వేత్త హర్ష్ గోయెంకా ఈ వీడియోను చూసిన వెంటనే, తన ట్విట్టర్ వాల్ పై పోస్ట్ చేశారు. ఆ వీడియోను పంచుకుంటూ, ఈ రకం ఉత్పత్తి చాలా మన్నికైనది, కొత్తది - స్క్రాప్, సెవెన్ సీటర్ వాహనంతో తయారు చేశారు అని పొగిడాడు. సూర్యకాంతి నుండి శక్తిని తీసుకోవడమే కాదు, నీడను కూడా అందిస్తోంది. ఈ రకమైన సాంకేతికతను చూస్తే గర్వకారణంగా ఉంటోందని ఆయన స్పందించారు.
స్క్రాప్‌తో తయారు చేసిన ఈ 7 సీట్ల వాహనం చాలా అద్భతమైన డిజైన్‌ను కలిగి ఉందని, ఇందులో సోలార్ ప్యానెల్ ప్రయాణికులకు షేడ్‌గా కూడా పనిచేస్తుందని ఆయన రాసుకొచ్చారు. సాంకేతిక పురోగతిలో ఇది ఒక స్వర్ణయుగం అని మరొక యూజర్ తన కామెంట్ రూపంలో తెలిపారు. కొత్త టెక్నాలజీ ప్రతిచోటా కనిపిస్తుంది. ధనవంతుల నుండి పేదల వరకు, యువకుల నుండి పెద్దల వరకు. అందరిలోనూ టెక్నాలజీ వాడకంలో సృజనాత్మకత కనిపిస్తోందని తెలిపారు.
వైరల్ వీడియోలో, 8-10 వేల రూపాయలు విలువ చేసే స్క్రాప్ నుంచి నుండి ఈ వాహనంలో ప్రతిదీ కొనుగోలు చేసినట్లు యువకుడు స్వయంగా చెబుతున్నాడు. ఇది 200 కిలోమీటర్ల వరకు పరిగెత్తగలదని, సూర్యరశ్మి ఉన్నంత వరకు ఇది పరుగెత్తుతుందని యువకుడు చెప్పాడు. ఆ యువకుడు 7గురికి కూర్చోబెట్టుకుని ఈ వాహనం నడుపుతున్నట్లు కూడా చూడవచ్చు.