ఆపిల్, ఇతర కంపెనీలు కూడా ఉద్యోగులను వారానికి కనీసం మూడు రోజులు ఆఫీసులో ఉండాలని కోరిన కొద్ది రోజుల తర్వాత IT సంస్థ నుండి ఈ పిలుపు వచ్చింది. ఇతర సంస్థలలో మహీంద్రా అండ్ RPG గ్రూప్ ఉన్నాయి. మరోవైపు స్విగ్గీ, మీషో వంటి కొన్ని ఇతర కంపెనీలు ఉద్యోగులను దేశంలో ఎక్కడి నుండైనా పని చేసే అవకాశాన్ని కల్పించాయి.
కోవిడ్-19 కేసులు తగ్గుముఖం పట్టడం, ఆఫీసులు పునఃప్రారంభం కావడంతో దేశంలోని అతిపెద్ద ఐటీ కంపెనీల్లో ఒకటైన టీసీఎస్ (టాటా కన్సల్టెన్సీ సర్వీస్) చాలా ఏళ్ల తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ కి స్వస్తి పలుకుతున్నట్లు తెలిపింది. అంతేకాదు టెక్ కంపెనీ ఉద్యోగులను నవంబర్ 15 నుండి ఆఫీసులకి తిరిగి రావాలని కోరింది.
ఆపిల్, ఇతర కంపెనీలు కూడా ఉద్యోగులను వారానికి కనీసం మూడు రోజులు ఆఫీసులో ఉండాలని కోరిన కొద్ది రోజుల తర్వాత IT సంస్థ నుండి ఈ పిలుపు వచ్చింది. ఇతర సంస్థలలో మహీంద్రా అండ్ RPG గ్రూప్ ఉన్నాయి. మరోవైపు స్విగ్గీ, మీషో వంటి కొన్ని ఇతర కంపెనీలు ఉద్యోగులను దేశంలో ఎక్కడి నుండైనా పని చేసే అవకాశాన్ని కల్పించాయి.
సాధారణ ప్రకటన చేసిన తర్వాత TCS ఇప్పుడు అధికారికంగా ఈ ఏడాది నవంబర్ 15 నుండి ఆఫీసులకి తిరిగి రావాలని ఉద్యోగులను కోరింది. కోవిడ్ మహమ్మారి వ్యాప్తి కారణంగా ఐటీ కంపెనీ టిసిఎస్ ఉద్యోగులను వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి అనుమతించింది.
నివేదికలు చూస్తే నవంబర్ 15 తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి TCS ప్లాన్ చేయడం లేదు, అంటే ప్రతి ఉద్యోగి TCSలో ఆఫీసుకి వెళ్లవలసి ఉంటుంది. అంతేకాకుండా, 95 శాతం మంది ఉద్యోగులు పాక్షికంగా, 70 శాతం కంటే ఎక్కువ మంది పూర్తిగా టీకాలు పొందడంతో ఐటి దిగ్గజం ఉద్యోగులను తిరిగి ఆఫీసులకి రావాలని పిలుస్తోంది. ప్రస్తుతం కంపెనీలో 20 నుంచి 25 శాతం మంది ఉద్యోగులు తిరిగి విధుల్లో చేరారు.
25/25 ప్లాన్‌ను మరింత కంట్రోల్ పద్ధతిలో అమలు చేయాల్సిన అవసరం ఉన్నందున, కంపెనీ రిటర్న్-టు-ఆఫీస్ మోడల్‌ను డ్రైవ్ చేస్తూనే ఉంటుందని టిసిఎస్ సిఈఓ అండ్ ఎండి రాజేష్ గోపీనాథన్ మీడియా ఛానెల్‌లకు చెప్పారు.
వేరియబుల్ పే పై కొంతమంది ఉద్యోగుల పేమెంట్ తగ్గించినట్లు వచ్చిన నివేదికలను కంపెనీ ఖండించింది అలాగే 6 లక్షలకు పైగా ఉద్యోగులందరికీ 100 శాతం వేరియబుల్ పే చెల్లిస్తామని తెలిపింది. ఇన్ఫోసిస్ అండ్ విప్రో ఆపరేటింగ్ మార్జిన్ ఒత్తిడిని పేర్కొంటూ వేరియబుల్ పే తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి.
గత వారం, విప్రో మిడ్ అండ్ సీనియర్ లెవెల్ ఉద్యోగులకు వేరియబుల్ పే నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఫ్రెషర్ అండ్ జూనియర్-లెవెల్ సిబ్బందికి ఐటి కంపెనీ 30 శాతం కోత తర్వాత వేరియబుల్ పే అందిస్తుంది.
