అంబానీ ఇంట.. పెళ్లి అంటే మాటలు కాదు. అంరంగ వైభవంగా వారి ఇంట ఇటీవల రెండు వివాహాలు జరిగాయి. మొన్నటికి మొన్న ముకేష్ అంబానీ గారాల పట్టి ఇషా అంబానీ వివాహం జరగగా.. తాజాగా వారి కుమారుడు ఆకాశ్ అంబానీ పెళ్లి జరిగింది. ఆకాశ్ చిన్ననాటి స్నేహితురాలు శ్లోకా మెహతాతో వివాహం జరిగింది.

పెళ్లి కన్నా కూడా.. పెళ్లిలో అత్త నీతా అంబానీ కోడలికి ఇచ్చిన గిఫ్ట్ గురించే ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు. అంబానీ ఇంట కోడలు అంటే మాటలా అందుకే.. ప్రపంచంలో అంత్యంత కాస్ట్లీ గిఫ్ట్ ని ఇచ్చారు. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా రూ.300కోట్లు విలువచేసే డైమండ్ నక్లెస్ ని కోడలికి బహుమతిగా ఇచ్చారు.

నిజానికి తమ కుటుంబ వారసత్వంగా వస్తున్న బంగారం హారాన్ని కోడలికి పెళ్లిలో కానుకగా ఇవ్వాలనుకున్నారట మొదట నీతా అంబానీ. కానీ  సమయానికి తగ్గట్టుగా మనసు మార్చుకున్న నీతా దానికి భిన్నంగా ప్రపంచంలోనే అత్యంత విలువైన నగను ఎంపిక చేయాలనుకున్నారట.  అందుకే అత్యంత విలువైన వజ్రాలు, ఇతర విలువైన రాళ్లు పొదిగిన నెక్లెస్‌ను ప్రత్యేకంగా డిజైన్‌ చేయించి మరీ గిఫ్ట్‌గా అందించారట. 

తనెంతో ఇష్టంగా చేయించిన వజ్రాల హారాన్ని  శ్లోకా మెడలో అలంకరించి నీతా ముచ్చట పడిపోగా, అటు అత్తగారిచ్చిన ప్రేమ పూర్వక కానుకతో శ్లోకా కూడా అంతే మురిసిపోయారట. కాగా.. ఇప్పుడు ఆ నక్లెస్ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.