Asianet News TeluguAsianet News Telugu

నీతా అంబానీ కొడుకు ఫస్ వెడ్డింగ్ కార్డు.. వారణాసిలోని కాశీ విశ్వనాథుని గుడిలో పూజలు

 కుమారుడి  పెళ్ళికి ముందు రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్‌పర్సన్ నీతా అంబానీ ఆశీర్వాదం కోసం కాశీ విశ్వనాథ ఆలయాన్ని తాజాగా సందర్శించారు.
 

Nita Ambani presents her son's wedding invitation to Kashi Viswanathan in Varanasi-sak
Author
First Published Jun 27, 2024, 8:31 AM IST

 బిలియనీర్ ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్ళికి ముందు రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు & చైర్‌పర్సన్ నీతా అంబానీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకొని పూజలు చేశారు. అలాగే, అనంత్ అంబానీ తల్లి నీతా అంబానీ ఫస్ట్ పెళ్లి కార్డు కాశీ విశ్వనాథన్‌ ఆలయంలో అందించారు.

అందమైన గులాబీ రంగు చీరలో నీతా అంబానీ ఆలయానికి వచ్చి మొదట గంగా హారతిలో పాల్గొన్నారు. తరువాత ఆమె మీడియాతో మాట్లాడుతూ కాశీ విశ్వనాథన్‌ను దర్శించుకోవడానికి కారణం గురించి  మాట్లాడుతూ  "నేను శివుడిని ప్రార్ధించి, అనంత్ & రాధికల పెళ్లి  కార్డుతో ఇక్కడకు వచ్చాను. అయితే 10 సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ  ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. ఇక్కడ అభివృద్ధిని చూసి చాల సంతోషంగా ఉంది." అని అన్నారు 

ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC)లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో జూలై 12న అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లి  జరగనుంది.

Nita Ambani presents her son's wedding invitation to Kashi Viswanathan in Varanasi-sak

ఈ వివాహ వేడుకలు హిందూ సంప్రదాయాల ప్రకారం ప్లాన్ చేశారు. జూలై 12, శుక్రవారం శుభ కళ్యాణంతో పెళ్లి  కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. గెస్టులు భారతీయ సంప్రదాయ దుస్తులను ధరించాలని సూచించారు. జూలై 13, శనివారం శుభ్ ఆశీర్వాదంతో వేడుకలు కొనసాగుతాయి.  చివరి ఈవెంట్, మంగళ్ ఉత్సవ్ లేదా వేడింగ్ రిసెప్షన్ జూలై 14, ఆదివారం జరుగుతుంది.  
రాధిక మర్చంట్ ఎన్‌కోర్ హెల్త్‌కేర్ CEO విరెన్ మర్చంట్ అండ్  ఫౌండర్  శైలా మర్చంట్ కుమార్తె. 

ఈ ఏడాది మొదట్లో గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో తొలి ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరిగాయి. వ్యాపార ప్రముఖులు, దేశాధినేతలు, హాలీవుడ్ ఇంకా  బాలీవుడ్ ప్రముఖులు ప్రత్యేక అతిథులుగా మెటా వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ అతని భార్య ప్రిసిల్లా చాన్, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, ఇవాంకా ట్రంప్ ఉన్నారు.

ఈ వేడుకలో భారత కార్పొరేట్ దిగ్గజాలు గౌతమ్ అదానీ, నందన్ నీలేకని, అదార్ పూనావాలా, క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ వేడుకకి ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్ కూడా హాజరయ్యారు. అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, కరణ్ జోహార్, రణబీర్ కపూర్-ఆలియా భట్, అనిల్ కపూర్, మాధురీ దీక్షిత్ అలాగే  ఇతర బాలీవుడ్ ప్రముఖులు ఈ వేడుకలకు వచ్చారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios