కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం లోక్ సభలో బడ్జెట్ ని ప్రవేశపెట్టారు. కాగా... ఈ బడ్జెట్ ని చదివి వినిపిస్తున్న క్రమంలో ఆమె చాణక్య నీతిని ప్రస్తావించారు.

‘‘కార్య పురుష కరేన..లక్ష్యం సంపాదయతే’ అని చాణక్య నీతి చెబుతోంది. అంటే మానవ ప్రయత్నం కచ్చితంగా ఉంటే ఎలాంటి లక్ష్యాలనైనా పూర్తి చేయగలం అని అర్థం’ అని సీతారామ్‌ చెప్పారు. ఆమె చాణక్య నీతికి లోక్ సభలో ఇతర సభ్యులు గట్టిగా బల్లలు  చరిచి మరీ అభినందనలు తెలిపారు.

ఆమె మాత్రం తన ప్రసంగాన్ని కొనసాగించారు.  తమ ప్రభుత్వం దేశ వృద్ధికి కట్టుబడి ఉందన్నారు. ప్రజలు అభివృద్ధికే పట్టం కట్టారని చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదేళ్లలోనే దేశ ఆర్థిక వ్యవస్థను లక్ష కోట్ల డాలర్లు పెంచామని గర్వంగా చెప్పారు.  ఈ ఏడాది చివరి నాటికి 3 ట్రిలియన్‌ డాలర్లకు చేరుకుని.. త్వరలోనే 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక శక్తిగా దేశం ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.