న్యూ ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రధాన విద్యా కార్యక్రమం "బేటీ బచావో, బేటీ పాడావో"ని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రశంసించారు.ఈ రోజు పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే  "బేటీ బచావో, బేటీ పాడావో" కార్యక్రమం అద్భుతమైన ఫలితాలను సాధించిందని ఆమే తెలిపారు. ఫలితంగా అబ్బాయిల కంటే ఎక్కువ మంది బాలికలే పాఠశాలల్లో చేరారు అని అన్నారు.

బాలికల ప్రాథమిక స్థాయి స్కూల్ లలో  బాలికల చేరికలు 94.32 శాతంగా ఉందని, అబ్బాయిలకు 89.28 శాతంగా ఉందని ఆమె పేర్కొన్నారు. 2020-21 సంవత్సరం విద్యా రంగానికి రూ .99,300 కోట్లును కేటాయించారు.2018-19 బడ్జెట్ లో  విద్యా రంగానికి రూ .94,853.64 కోట్లు కేటాయించింది.  గత ఏడాది బడ్జెట్ కంటే దాదాపు 10,000 కోట్ల రూపాయల పెరుగుదల పెగ్గింది.

నిర్మలా సీతారామన్ కొత్త విద్యా విధానాన్ని త్వరలో వెల్లడిస్తారని, దీనిపై ప్రభుత్వానికి 2 వేలకు పైగా సూచనలు కూడా వచ్చాయని చెప్పారు. ప్రభుత్వం కొత్త జాతీయ పోలీసు విశ్వవిద్యాలయం, నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ విశ్వవిద్యాలయాన్ని కూడా ఏర్పాటు చేయనుంది. "డిగ్రీ స్థాయిలో ఆన్‌లైన్ విద్యా కోర్సులు ప్రవేశపెట్టనున్నారు.

వీటిని నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్‌లో టాప్ 100లో ఉన్న కళాశాలలు అందించగలవు" అని నిర్మలా సీతారామన్ అన్నారు.దేశంలో అందుబాటులో ఉన్న విద్య  నాణ్యతను మెరుగుపరిచేందుకు యువ బాల, బాలికలను "భవిష్యత్తులో సిద్ధంగా" చేసే ప్రయత్నంలో, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డిఐ), మల్టీ వాణిజ్య రుణాలు (ఇసిబి) విద్యారంగంలో అనుమతించనున్నారు.

ఐదేళ్ల క్రితం హర్యానాలో పిఎం మోడీ ప్రారంభించిన "బేటీ బచావో, బేటీ పాడావో" అబార్షన్, శిశు హత్యల సమస్యను పరిష్కరించడానికి  అలాగే  బాలికల విద్యను ప్రోత్సహించడానికి ఈ స్కీమ్ ప్రారంభించారు.ఈ కార్యక్రమ ప్రారంభోత్సవంలో ర్యాలీలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడి మాట్లాడుతూ "అబార్షన్, శిశు హత్యల వల్ల కలిగే సంక్షోభం మనకు తెలియకపోతే, మన రాబోయే తరాలు పెద్ద సమస్యను ఎదుర్కొంటాయి" అని అన్నారు.