జిమెయిల్ కి పోటీగా యాహూ యాప్ కొత్త వెర్షన్.. 1టి‌బి స్టోరేజ్ ఫ్రీ..

యాహూ మెయిల్‌తో యూజర్లు 1టి‌బి ఫ్రీ స్టోరేజ్ పొందుతారు. ఈ ఫీచర్   గూగుల్ మెయిల్ తో  పోటీగా ఉంటుంది, ఎందుకంటే జిమెయిల్‌ లో 15 జి‌బి స్టోరేజ్ ఉంది. ఈ యాప్‌లో మీరు మీ యాహూ , జిమెయిల్‌, ఏ‌ఓ‌ఎల్, మైక్రోసాఫ్ట్  అక్కౌంట్స్ కూడా లింక్ చేయవచ్చు. 

New version of Yahoo Mail app launched will get 1TB of storage for free

సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్ కంపెనీ యాహూ మెయిల్ యాప్ కొత్త వెర్షన్‌ను పరిచయం చేసింది. యాహూ ప్రకారం, యూజర్లు యాహూ మెయిల్‌తో అత్యంత ప్రత్యేకమైన అనుభవాన్ని పొందుతారు. యాహూ మెయిల్‌తో యూజర్లు 1టి‌బి ఫ్రీ స్టోరేజ్ పొందుతారు. ఈ ఫీచర్   గూగుల్ మెయిల్ తో  పోటీగా ఉంటుంది, ఎందుకంటే జిమెయిల్‌ లో 15 జి‌బి స్టోరేజ్ ఉంది. ఈ యాప్‌లో మీరు మీ యాహూ , జిమెయిల్‌, ఏ‌ఓ‌ఎల్, మైక్రోసాఫ్ట్  అక్కౌంట్స్ కూడా లింక్ చేయవచ్చు. కొత్త యాప్ రూపకల్పనకు సంబంధించి కూడా చాలా మార్పులు చేసింది, అయితే చాలా వరకు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ లాగా కనిపిస్తుంది.

యాహూ మెయిల్ టాప్ ఫీచర్లు
GROUP BY SENDER:ఈ ఫీచర్ సహాయంతో మీరు అదే ఇమెయిల్ ఐడి నుండి మెయిల్‌లను గ్రూప్ లో ఉంచవచ్చు ఇంకా ఒకే క్లిక్‌తో డిలెట్ చేయవచ్చు. మెసేజ్ డిలెట్ చేయడంలో పెద్ద ప్రయోజనం ఉంటుంది. 
ఇన్‌బాక్స్ నావిగేషన్: ఈ ఫీచర్ ఇ-మెయిల్‌లను ఫిల్టర్ చేస్తుంది. ఇందులో అటాచ్‌మెంట్‌లు ఉన్న మెయిల్స్ ఒక చోట, అటాచ్‌మెంట్లు లేనివి మరో చోట ఉంటాయి. ఏదైనా మెయిల్ సెండింగ్ అయితే యాప్ దానిని విడిగా ఫిల్టర్ చేస్తుంది. ఏదైనా ప్రమోషనల్ ఆఫర్ గడువు ముగిసినట్లయితే, మీరు యాప్‌లో నోటిఫికేషన్‌ను కూడా పొందుతారు.
రిసిప్ట్  వ్యూ: ఈ ఫీచర్ సహాయంతో మీరు మీ ఫుల్ షాపింగ్ హిస్టరీ ఒకే చోట, ఒకే క్లిక్‌తో చూడవచ్చు.

కొత్త వెర్షన్ యాప్‌ పై యాహూ కమ్యూనికేషన్స్ జి‌ఎం అండ్ ఎస్‌వి‌పి జోష్ జాకబ్సన్ మాట్లాడుతూ, "యాహూ  మెయిల్ గత 25 సంవత్సరాలుగా యూజర్ల జీవితంలో ఒక భాగంగా ఉంది, కాబట్టి ప్రజలకు ఇది ఎంత ముఖ్యమో మాకు తెలుసు.  ఎవరికి ఎలాంటి ఫీచర్ అవసరమో వారి అభిప్రాయాన్ని అర్థం చేసుకోని మా స్కిల్స్ ఫలితమే ఈ కొత్త ఫీచర్లు- ఈ ఫీచర్స్ యాహూ మెయిల్‌ను సమగ్రంగా వాటిలో భాగం చేస్తాయి" అని అన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios