Asianet News TeluguAsianet News Telugu

నేటి నుండి ఈ రూల్స్ మార్పు: మీపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకోండి..

ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, 1 అక్టోబర్ 2022 నుండి పన్ను చెల్లింపుదారులు అటల్ పెన్షన్ స్కీమ్‌లో చేరలేరు. మరోవైపు, మీకు పోస్టాఫీసులో సేవింగ్స్ అక్కౌంట్ ఉంటే మీరు అటల్ పెన్షన్ యోజన కింద దరఖాస్తు చేసుకోవచ్చు.

New Rule from Today: These rules changed from today, know what will be the effect on you
Author
First Published Oct 1, 2022, 1:24 PM IST

నేటి నుంచి కొన్ని రూల్స్ మారనున్నాయి. ఈ రూల్స్ మార్పు వల్ల సామాన్యులపై ప్రభావం పడనుంది. అలాగే మీ పాకెట్ పై అదనపు భారం కూడా పెరుగుతుంది. అయితే ఈ మార్పుల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. అక్టోబరు నెల ప్రారంభం నుండి మార్చబోయే నిబంధనలలో క్రెడిట్-డెబిట్ కార్డు లోకలైజేషన్, అటల్ పెన్షన్ స్కీమ్, గ్యాస్ సిలిండర్ల ధరలు, విద్యుత్ బిల్లులపై సబ్సిడీ ఉన్నాయి.

 అటల్ పెన్షన్ యోజన
ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, 1 అక్టోబర్ 2022 నుండి పన్ను చెల్లింపుదారులు అటల్ పెన్షన్ స్కీమ్‌లో చేరలేరు. మరోవైపు, మీకు పోస్టాఫీసులో సేవింగ్స్ అక్కౌంట్ ఉంటే మీరు అటల్ పెన్షన్ యోజన కింద దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, మీరు ఇప్పటికే ఈ ప్లాన్‌కు సబ్‌స్క్రైబ్ చేసి ఉంటే, కొత్త మార్పులు మిమ్మల్ని ప్రభావితం చేయవు. మరోవైపు, మీరు పన్ను చెల్లింపుదారుగా ఉన్నప్పటికీ ఈ స్కీమ్‌కు సభ్యత్వాన్ని పొందినట్లయితే అక్కౌంట్ మూసివేయడం ద్వారా మీ డబ్బు తిరిగి ఇవ్వబడుతుంది.  

డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్ పేమెంట్  
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూచనల ప్రకారం, అక్టోబర్ 1 నుండి డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్ పేమెంట్ ప్రక్రియలో టోకనైజేషన్ విధానం అమలు చేయబడుతుంది. ఈ సిస్టం అమలులోకి వచ్చిన తర్వాత వ్యాపారులు, పేమెంట్ అగ్రిగేటర్లు, పేమెంట్ గేట్‌వేలు కస్టమర్ల కార్డుకు సంబంధించిన సమాచారాన్ని సేవ్ చేయలేరు.  

మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ 
మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో కూడా ఇన్వెస్ట్ చేస్తే లేదా భవిష్యత్తులో అలా చేయాలనుకుంటే మీరు అక్టోబర్ 1 నుండి నామినేషన్ సమాచారాన్ని అందించడం తప్పనిసరి. నామినేషన్ వివరాలు ఇవ్వని వారు నామినేషన్ వెసులుబాటు వద్దు అని డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆగస్టు 1 నుంచి ఈ నిబంధన అమల్లోకి రావాల్సి ఉండగా అక్టోబర్ 1 నుంచి అమలు చేసేందుకు నిర్ణయించారు.

GST ఇ-ఇన్‌వాయిస్‌ 
అక్టోబరు 1 నుండి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ లేదా GST కింద మొత్తం రూ. 10 కోట్లు అండ్ అంతకంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న వ్యాపారులకు ఇ-ఇన్‌వాయిస్ తప్పనిసరి. రెవెన్యూ లోటును అధిగమించడానికి అలాగే వ్యాపార ప్రపంచం నుండి ఎక్కువ పన్ను వసూలు చేయడానికి ప్రభుత్వం దాని పరిమితిని రూ.20 కోట్ల నుండి రూ.10 కోట్లకు తగ్గించింది. జీఎస్టీ కౌన్సిల్ సిఫారసుల ఆధారంగా నిబంధనలను నోటిఫై చేశామని ఈ మేరకు ఓ ప్రకటనలో పేర్కొంది.

విద్యుత్‌పై సబ్సిడీ పొందేందుకు కొత్త నిబంధనలు
ఢిల్లీలో విద్యుత్ బిల్లుపై సబ్సిడీకి వర్తించే ప్రస్తుత నిబంధనలు అక్టోబర్ 1 నుండి మారాయి. సెప్టెంబర్ 30న విద్యుత్‌పై సబ్సిడీని నిలిపివేస్తున్నట్లు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సదుపాయం దీని కోసం దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. అంటే అక్టోబ‌ర్ 1 త‌ర్వాత క‌రెంటు బిల్లుపై స‌బ్సిడీ కావాలంటే..  ప్ర‌భుత్వానికి ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

వాణిజ్య సిలిండర్ల ధరలు
ఎల్‌పిజి ధరలను కేంద్ర ప్రభుత్వం ప్రతి నెలా ప్రారంభంలో సమీక్షిస్తుంది. అయితే, శనివారం ఉదయం దేశప్రజలకు రిలీఫ్ న్యూస్ వచ్చింది. ఏంటంటే వాణిజ్య సిలిండర్ల ధరలను ప్రభుత్వం తగ్గించింది. ఢిల్లీలో వాణిజ్య సిలిండర్ల ధర తగ్గింపు రూ.25.5. ప్రపంచ సంక్షోభం నేపథ్యంలో గ్యాస్ ధర రికార్డు స్థాయిలో 40 శాతం పెరిగిపోవడం గమనార్హం. 

బ్యాంకు రుణాలు
మూడు రోజుల పాటు జరిగిన ఆర్‌బీఐ ద్రవ్య విధాన సమావేశం అనంతరం రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ సెప్టెంబర్ 30న రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. రెపో రేటు ఇప్పుడు 5.4% నుంచి 5.9%కి పెరిగింది. ఆర్‌బీఐ తీసుకున్న ఈ నిర్ణయం అమల్లోకి రాగానే బ్యాంకు రుణాలు ఖరీదైనవి కానున్నాయి. ఇప్పటికే ఫ్లోటింగ్ రేటుపై రుణాలు తీసుకున్న వారి ఈఎంఐ కూడా అక్టోబర్ నెల నుంచి పెరుగుతుంది.  HDFC బ్యాంక్ కూడా రుణ వడ్డీ రేట్లను 50 bps పెంచుతున్నట్లు ప్రకటించింది. HDFC బ్యాంక్  ఈ నిర్ణయం అక్టోబర్ 1, 2022 నుండి అమలులోకి వచ్చింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios