పెద్ద నోట్ల రద్దు తర్వాత మార్కెట్లోకి రూ.500, రూ.2వేలు, రూ.100, రూ.200, రూ.50, రూ.10నోట్లు చలమాణిలోకి వచ్చాయి.  రక రకాల రంగులు, వెరైటీ డిజైన్లతో ఈ నోట్లను మార్కెట్లోకి తీసుకువచ్చారు. పాత నోట్లు చలామణి అవుతూనే.. కొత్త నోట్లు కూడా చలామణిలోకి వచ్చాయి. కాగా.. తాజాగా మరో కొత్త నోటు మార్కెట్లోకి రానుంది. 

ఆర్బీఐ( భారత రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా) త్వరలో నూతన రూ.20నోటును చలామణిలోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. రూ.20 నూతన నోటుకు అదనంగా కొన్ని ప్రత్యేకతలను జోడిస్తోంది. 2018 మార్చినాటికి రూ.20 నోట్లు 1,000 కోట్లు చలామణిలో ఉన్నాయి. వీటి సంఖ్య 2016 మార్చి 31నాటికి 492 కోట్లు మాత్రమే. అంటే రెండేళ్ళలోనే రెట్టింపు అయ్యాయన్నమాట. మొత్తం కరెన్సీ నోట్లలో రూ.20 నోట్ల విలువ 9.8 శాతం.

ఈ కొత్త రూ.20నోటు.. ఏ రంగులో ఉండబోతోందో అనే ఆసక్తి ఏర్పడింది. కాగా.. ఈ కొత్త నోటు మార్కెట్లోకి వచ్చినప్పటికీ.. పాత నోట్లు చలామణి అవుతాయని ఆర్బీఐ ప్రకటించింది.