కొత్త రూ.100 నోటు వస్తోందోచ్..మరి పాత నోటు సంగతేంటి..?

New Rs. 100 Note In Lavender Features Gujarat's 'Rani Ki Vav'
Highlights

ఈ రూ.100నోటు లెవెండర్ కలర్‌లో ఉండబోతోంది. అయితే.. కొత్త నోట్లు మార్కెట్లోకి వస్తున్నాయి కదా.. పాత రూ.100 నోట్లు చలామణిలో ఉంటాయా లేదా అనే అనుమానం మీకు వచ్చే ఉంటుంది. అలాంటి అనుమానాలు ఏవీ పెట్టుకోనక్కర్లేదని ఆర్బీఐ తెలిపింది.

ఇప్పటి వరకు కొత్త రూ.2000, రూ.500, రూ.200 ,రూ.50, రూ.10 నోట్లు చూశారు కదా.. త్వరలోనే కొత్త రూ.100 నోటు చూడబోతున్నారు. వచ్చే నెలలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ కొత్త రూ.100 నోటును మార్కెట్లోకి తీసుకురానుంది.

త్వరలోనే మార్కెట్లోకి రానున్న ఈ నోటు వివరాలను ఆర్బీఐ తెలియజేసింది. గుజరాత్‌లోని ప్రఖ్యాత హెరిటేజ్ కట్టడమైన 'రాణి కా వావ్' చిత్రాన్ని నోటుకు వెనుకవైపు  ముద్రించారు. ఇక ముందువైపు ఎప్పటిలాగే జాతిపిత మహాత్మాగాంధీ  ఫోటోను ముద్రించారు.

ఈ రూ.100నోటు లెవెండర్ కలర్‌లో ఉండబోతోంది. అయితే.. కొత్త నోట్లు మార్కెట్లోకి వస్తున్నాయి కదా.. పాత రూ.100 నోట్లు చలామణిలో ఉంటాయా లేదా అనే అనుమానం మీకు వచ్చే ఉంటుంది. అలాంటి అనుమానాలు ఏవీ పెట్టుకోనక్కర్లేదని ఆర్బీఐ తెలిపింది.

ఈ కొత్త నోటు వచ్చినా.. పాత నోట్లు యదావిధిగా చలామణి అవుతాయని ఆర్బీఐ వివరించింది. ప్రస్తుతం చలామణిలో ఉన్న రూ.100 నోటు కన్నా.. కొత్త నోటు కాస్త చిన్నదిగా ఉంటుంది. 66మిల్లీ మీటర్ల పొడవు, 142 మిల్లీ మీటర్ల వెడల్పుతో ఈ నోటు ఉంటుందని ఆర్బీఐ చెప్పింది.

loader